Andhra Pradesh : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…దివ్వాంగులకు ఇకపై 4 శాతం రిజర్వేషన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులుకు మరింత ఆసరా ఇచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్స్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులుకు మరింత ఆసరా ఇచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్స్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం వారికి 3 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా, తాజాగా జగన్ సర్కార్ ఒక్క శాతం పెంచి..మొత్తం నాలుగు శాతంగా ఖరారు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అంధత్వం, చూపు మందగించడం వంటి సమస్యలు ఉన్నవారికి 1 శాతం..మస్తిష్క పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, చలన సంబంధ వైకల్యం, కండరాల బలహీనత, మరగుజ్జుతనం, యాసిడ్ దాడి బాధితులకు 1 శాతం…. వినికిడి లోపం ఉన్నవారికి 1 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఇక లెర్నింగ్ డిసెబిలిటీ, ఆటిజం వంటి సమస్యలతో బాధపడేవారికి సైతం 1 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో అయినా 5గురికి మించి స్టాఫ్ ఉంటే..అక్కడ ప్రమోషన్స్‌లోనూ ఇదే తరహా రిజర్వేషన్లు అమలుకానున్నాయి.