తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌

తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌

Sabitha Indra Reddy: హైదరాబాద్‌ నగరంలోని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం..

Subhash Goud

|

Jul 05, 2021 | 11:59 AM

Sabitha Indra Reddy: హైదరాబాద్‌ నగరంలోని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులందరూ దాదాపు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటారని, అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకోని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని వారు నిరసన వ్యక్తం చేశారు. సత్యసాయి నిగమాగమం నుంచి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వరకు విద్యార్ధులు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో మంత్రి జోక్యం చేసుకుని విద్యార్థుల ఆందోళన సద్దుమణిగించే ప్రయత్నం చేశారు కొంత మంది విద్యార్థులతో మాట్లాడి.. పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు.

విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఉండే అవకాశం కల్పిస్తామని, అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని మంత్రి స్పష్టం చేశారు.

కాగా, నాలుగు రోజుల కిందటనే డిగ్రీతో పాటు పీజీ పరీక్షలను నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే గతంలో వాయిదా పడిన డిగ్రీ పరీక్షలను జులై 8 నుండి ప్రారంభం కానుండగా, పీజీకి సంబంధించి జులై 19 నుండి నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. కరోనా తగ్గు ముఖం పట్టడడంతో అన్ని రకాల విద్యా సంస్థలను కూడా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు తల్లి దండ్రుల ఆందోళనలతో స్కూళ్లకు మాత్రం ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం చేశారు. ఇప్పుడు డిగ్రీ పరీక్షలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.

సందర్భంగా పరీక్షల రద్దుపై మంత్రికి విద్యార్థులు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మంత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. స్పష్టమైన నిర్ణయం తెలపాలని డిమాండ్‌ చేసిన విద్యార్థులు మంత్రి నివాస సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు నగరంలో ఇంజనీరింగ్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Aasara Pensions: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్‌..!

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? క్యారెట్‌ అంటే ఏమిటి..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu