Aasara Pensions: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్‌..!

Aasara Pensions: గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారిలో అర్హులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు..

Aasara Pensions: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్‌..!
Aasara Pensions
Follow us
Subhash Goud

|

Updated on: Jul 05, 2021 | 12:29 PM

Aasara Pensions: గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. నిన్న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత మంత్రివర్గంలో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పింఛన్‌ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పింఛన్‌ అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన వారికే ఆసరా పింఛన్లు ఇస్తుండగా.. తాజాగా కేసీఆర్‌ నిర్ణయంతో 57 ఏళ్లు నిండినవారికి కూడా వృద్ధాప్య పింఛన్లు అందనున్నాయి. అయితే కేసీఆర్‌ సూచనల మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు రూ.2,116, అదే దివ్యాంగులకు రూ.3,116 ను ప్రభుత్వం ఫింఛన్‌ అందిస్తోంది. కాగా, దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2 లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులు కారు. అలాగే ఓటర్‌ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరాకు అనర్హులు. దరఖాస్తుదారులకు ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే వ్యాపారాలు ఉండరాదు. పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేవారు.. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారై ఉండరాదు. అలాగే హెవీ వెహికిల్స్ ఉన్నవారు ఆసరాకు అనర్హులు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులై ఉండరాదు.

గతంలో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నామిన సీఎం కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో పింఛన్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన వారికి పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే గంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. ఏ విధంగా అయితే రూ.5 లక్షల రైతు బీమా అందిస్తున్నామో.. ఇక మీదట చేనేత కార్మికులకు కూడా అలాగే రూ.5 లక్షల చేనేత బీమా ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. రాబోయే రెండు నెలల్లో దీన్ని అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. చేనేతల విషయంలో కొంత కార్పస్‌ ఫండ్‌ పెట్టి వారికి మంచి చేయాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. పరుగులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!

PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు వేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం..!