తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్‌టైమ్‌ క్యాస్ట్ సర్టిఫికెట్‌’..

తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై 'లైఫ్‌టైమ్‌ క్యాస్ట్ సర్టిఫికెట్‌'..

తెలంగాణ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కుల ధృవీకరణ పత్రం జారీ చేసే  విధానాన్ని కూడా మార్చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Ravi Kiran

|

Sep 09, 2020 | 3:48 PM

Caste And Income Certificates In Telangana: తెలంగాణ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కుల ధృవీకరణ పత్రం జారీ చేసే  విధానాన్ని కూడా మార్చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక నుంచి ఒకేసారి లైఫ్‌టైమ్‌ క్యాస్ట్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తామన్నారు. సమగ్ర సర్వే విధానం ద్వారా సేకరించిన డేటా బేస్‌ను ఆధారంగా చేసుకుని ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా అందజేస్తామని, ఈ అధికారాలను గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు అప్పగిస్తున్నామని ప్రకటించారు.

అలాగే తెలంగాణలో ఉన్న భూముల వివరాలన్నీ ఇక ఆన్‌లైన్‌లోకి రాబోతున్నాయి. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధారంగా భూముల వివరాలను ప్రపంచంలో ఏ మూలనుంచైనా తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను తీసుకురాబోతోంది. ధరణి పోర్టల్‌లో భూముల రికార్డులను అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌గా విభజించి నమోదు చేస్తారు.

Also Read:

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!

జగన్ సర్కార్ సంచలనం.. నగదు బదిలీ పధకానికి శ్రీకారం..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu