CM Jagan: దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్.. అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ సమర్పణ
ఏపీ సీఎం జగన్ బెజవాడ కొండపై కొలువదీరిన దుర్గమ్మను దర్మించకున్నారు. ఈ క్రమంలో ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టుచీర, పసుపు, కుంకుమ సమర్పించారాయన. ఇంద్రకీలాద్రికి వచ్చిన సీఎంకు తొలుత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు, పండితులు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి దుర్గగుడి సందర్శన, పట్టువస్త్రాల సమర్పణ టైమ్‌లో భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ముఖ్యమంత్రి చెప్పడంతో దర్శనాలు కొనసాగాయి. ఓవైపు సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తుండగా… మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ సంతృప్తిగా వెళ్లిపోయారు. గతంలో ముఖ్యమంత్రి దుర్గగుడికి వస్తే రెండు గంటల పాటు దర్శనాలను ఆపేసేవారు అధికారులు. ఈసారి మాత్రం సీఎం సూచనతో దర్శనాలకు బ్రేక్ పడకుండా చూశారు.
— చదువుల తల్లిగా భక్తులను కరుణిస్తోంది కనకదుర్గ. ఆదివారం, మూల నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి లక్షల్లో భక్తులు తరలివచ్చారు. ముఖ్యమంత్రితో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మకు పసుపు, కుంకుమ, పట్టుచీర సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు అర్చకులు.
— మొత్తం 12 చోట్ల రోప్ పార్టీలతో క్యూలైన్లను కట్టడి చేస్తున్నారు. 500 మందిని ఒకసారి క్యూలైన్‌లోకి వదులుతూ తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్‌వైపు వాహనాల్ని అనుమతించడం లేదు. రద్దీని బట్టి ప్రధాన కూడళ్ళ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. సిటీలోకి వచ్చే వాహనాల్ని దారి మళ్లించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..