AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Pen Color: మీ పుట్టిన తేదీ ప్రకారం పెన్ రంగును ఎంచుకోండి.. మీరు ప్రతి పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు!

జ్యోతిషశాస్త్రంలోని చిన్న చిన్న రెమెడీ వారి ఎదుగుదలకు సహాయపడే ఛాన్స్ ఉంది. అయితే మనం ఉపయోగించే వాటిలోనే మన అదృష్టం దాగి..

Lucky Pen Color: మీ పుట్టిన తేదీ ప్రకారం పెన్ రంగును ఎంచుకోండి.. మీరు ప్రతి పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు!
Lucky Color Pens Colour
Sanjay Kasula
|

Updated on: Oct 03, 2022 | 7:03 AM

Share

మనలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. తమకు ఆ రంగు కలిసి వచ్చిందని.. ఆ డ్రెస్‌ లక్కీ డ్రెస్ అని.. ఇలా మనలో చాలా మందికి పలు రకాల అభిప్రాయాలు ఉంటాయి. అయితే వీటిని అభిప్రాయం, అదృష్టం అని కాకుండా.. వారి న్యూమరాలజీ, జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని కలిసి వస్తుంటాయి. అయితే వారికి తెలియకుండానే వాటిలో ఫిక్స్ అవుతుంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో ఎదగాలని, పేరు, డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి ఎంత కష్టపడి పనిచేసినా వారికి తగిన స్థానం లభించదు. అటువంటి పరిస్థితిలో, జ్యోతిషశాస్త్రంలోని చిన్న చిన్న రెమెడీ వారి ఎదుగుదలకు సహాయపడే ఛాన్స్ ఉంది. అయితే మనం ఉపయోగించే వాటిలోనే మన అదృష్టం దాగి ఉంటుంది. ఇందులో పెన్ ఒకటి. కాబట్టి మీ రాడిక్స్ ప్రకారం మీరు ఏ రంగు పెన్ ఉపయోగించాలో ఈ రోజు మనం తెలుసుకుందాం.

  1. పుట్టిన సంఖ్య “ఒకటి(01)” అయిన వారికి బంగారు రంగు కలం చాలా శుభప్రదం. ఏదైనా శుభ కార్యం కోసం బయటకు వెళ్లేటప్పుడు బంగారు రంగు పెన్నును మీతో ఉంచుకుంటే అది మీకు కలిసి వస్తుంది.
  2. రాడిక్స్ సంఖ్య “రెండు(02)”గా.. ఇందులో 02,11,20 సంఖ్యలు వస్తాయి. వీరు తెలుపు రంగు పెన్నును తమ వద్ద ఉంచుకోవాలి. కావాలంటే వెండి రంగు పెన్ను కూడా మీతో ఉంచుకోవచ్చు. జీవితంలో ఓ మార్పుకు కారణం కావచ్చు.
  3. మీ జన్మ సంఖ్య మూడు అయితే, ఇందులో 03,12,21 ఈ సంఖ్యల జన్మదినం కలిగినవారు బంగారు రంగు పెన్ను మాత్రమే మీకు అదృష్టమని ఇస్తుంది. ఈ పెన్ను మీ చొక్కా, కోటు లేదా టీ-షర్ట్ జేబులో ఉంచుకోండి.. ఎందుకంటే మీ అదృష్టం బంగారు రంగులో మెరుస్తుంది.
  4. రాడిక్స్ నంబర్ 4 ఉన్నవానే ఎల్లప్పుడూ బ్రౌన్ పెన్ను వెంట తీసుకెళ్లాలి. మీరు ఏదైనా పరీక్ష లేదా ఇంటర్వ్యూ కోసం వెళుతున్నట్లయితే, ఖచ్చితంగా ఈ పెన్ను మీ దగ్గర ఉంచుకోండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.
  5. రాడిక్స్ సంఖ్య 5 కలిగినవారు ఆకుపచ్చ రంగు పెన్ను శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తులను క్లియర్ చేస్తుంది. సానుకూల శక్తిని పెంచడం ద్వారా వారికి రూట్ క్లియర్ చేస్తుంది.
  6. రాడిక్స్ సంఖ్య 6 స్థానికులకు క్రిస్టల్ క్లియర్ పెన్ చాలా శుభప్రదం. పెన్నుపై మెరిసే రత్నం ఉంటే.. అది వారికి శుభం. తెల్లగా మాత్రమే ఉండటానికి ప్రయత్నించండి. మీ రాడిక్స్ సంఖ్య ఏడు అయితే గ్రే కలర్ పెన్ మీ అదృష్టానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ రంగు మిమ్మల్ని మరింత కోపం నుంచి కూడా కాపాడుతుంది. విజయానికి మార్గం మీ కోసం తెరవబడుతుంది.
  7. బ్లూ కలర్ పెన్ రాడిక్స్ 8కి శుభప్రదంగా ఉంటుంది. ఇది కాకుండా, మీకు కావాలంటే, మీరు ఈ నలుపు లేదా ఏదైనా ముదురు రంగు పెన్ను మీతో ఉంచుకోవచ్చు.
  8. రాడిక్స్ 9 కోసం, ఎరుపు రంగు పెన్ను శక్తినిస్తుంది. ఈ ఎరుపు రంగు పెన్నుతో, ప్రతిచోటా వారి విజయ మార్గం తెరవబడుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం