AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌లో దారుణం.. క్రైస్తవ యువతి కిడ్నాప్‌‌.. ఏం చేశారో కూడా తెలీయని పరిస్థితి..

కిస్థాన్‌లో మైనార్టీల పట్ల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో క్రైస్తవ యువతిని స్థానిక ముస్లిం యువకులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన సోమవారం నాడు లాహోర్ సమీపంలోని యోహ్నాబాద్‌లో చోటుచేసుకుంది.

పాక్‌లో దారుణం.. క్రైస్తవ యువతి కిడ్నాప్‌‌.. ఏం చేశారో కూడా తెలీయని పరిస్థితి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2020 | 6:58 PM

Share

పాకిస్థాన్‌లో మైనార్టీల పట్ల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో క్రైస్తవ యువతిని స్థానిక ముస్లిం యువకులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన సోమవారం నాడు లాహోర్ సమీపంలోని యోహ్నాబాద్‌లో చోటుచేసుకుంది. సదరు యువతి పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిందిగా తెలుస్తోంది. అయితే కంపెనీ వెహికిల్ కోసం వెయిటింగ్‌ చేస్తుండగా ఇద్దరు ముస్లిం యువకులు ఆ క్రైస్తవ యువతి పాయింట్‌ వద్ద గన్‌ పెట్టి కిడ్నాప్ చేశారు. అక్కడ ఉన్న ఆమె సహచరులను బెదిరించారు. సదరు యువతిని కిడ్నాప్ చేసే ముందు క్రైస్తవ యువతి అంటూ దూషిస్తూ కిడ్నాప్‌కు పాల్పడినట్లు సదరు యువతి సహచరులు తెల్పినట్లు సమాచారం. ఈ సంఘటనపై సోమవారం నాడే యువతి తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ విషయాన్ని యువతి తల్లి స్వయంగా చెప్తోంది. కనీసం తన కూతురికి సంబంధించిన ఎలాంటి వివరాలు కూడా పోలీసులు చెప్పడం లేదని వాపోతోంది.

కాగా, ఈ ప్రాంతంలో నిత్యం మైనార్టీలకు చెందిన హిందూ, క్రైస్తవ యువతులను కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత స్థానిక ముస్లిం యువకులకు ఇచ్చి వివాహం చేయడం యథేచ్చగా కొనసాగుతోంది. అంతేకాదు వారిని బలవంతంగా మతం కూడా మార్చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ పంజాబ్, సింధ్ ప్రావిన్స్ ప్రాంతాల్లో వెయ్యి మందికి పైగా మైనార్టీ యువతులను అపహరించుకుపోవడం.. ఆ తర్వాత వారిని బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకోవడం జరుగుతోంది.