ఎన్టీఆర్ జయంతి… అరుదైన ఫోటోను షేర్ చేసిన మెగాస్టార్
నందమూరి తారక రామారావు 98 వ జయంతి సందర్బంగా సినీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్‌ను సైతం చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఏన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ…’ అంటూ […]

నందమూరి తారక రామారావు 98 వ జయంతి సందర్బంగా సినీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్‌ను సైతం చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఏన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ…’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరంజీవి ఎన్టీఆర్‌కు… ఎన్టీఆర్ చిరంజీవికి స్వీట్ తినిపించే ఫోటోను షేర్ చేశారు. ఈ రెండు ఫోటోల మధ్యలో “ఏ స్వీట్ మెమోరీ”అంటూ ట్యాగ్ లైన్‌ను జోడించారు.
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ… pic.twitter.com/LgSKsItxdO
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2020




