నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు..ఎన్‌సీపీని కాపాడేందుకు ఆ దేశంలోకి చైనా దూతల ఎంట్రీ

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలికను నివారించడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నలుగురు కీలకనేతలను నేపాల్‌ పంపించారు. అయితే వాళ్లతో నేపాల్‌ ప్రధాని ఓలి చర్చలు జరుపుతారా ? లేదా ? అన్న విషయంపై సస్పెన్స్‌..

నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు..ఎన్‌సీపీని కాపాడేందుకు ఆ దేశంలోకి చైనా దూతల ఎంట్రీ
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 26, 2020 | 10:31 PM

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలికను నివారించడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నలుగురు కీలకనేతలను నేపాల్‌ పంపించారు. అయితే వాళ్లతో నేపాల్‌ ప్రధాని ఓలి చర్చలు జరుపుతారా ? లేదా ? అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది.

సరిహద్దుల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు కొనసాగుతున్నాయి. నేపాల్‌ రాజకీయాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నేపాల్ పార్లమెంట్ ను రద్దైన తర్వాతి పరిణామాలను చైనా అత్యంత నిశితంగా గమనిస్తోంది.

ప్రధాని కేపీ ఓలీ శర్మ, ప్రచండ మధ్య ముదిరిన విభేదాలు కాస్తా… చీలిక వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రాకుండా ఉండేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్‌కు నలుగురు సభ్యుల టీమ్‌ను పంపించారు. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీలు చీలిక దిశగా వెళితే మాత్రం… దానిని నివారించే బాధ్యతను జిన్‌పింగ్ ఆ టీమ్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

చైనా రాయబారి హావో యాంకీ రాయబారం విఫలం కావడంతోనే జిన్‌పింగ్ ఈ బృందాన్ని ఎంపిక చేసి, నేపాల్‌కు పంపించారని చెబుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, మంత్రి గువో యేచౌ సారథ్యంలో ఈ టీమ్ నాలుగు రోజుల పాటు ఖాట్మాండులోనే బస చేయనుంది. అయితే ఇప్పటికే చైనా రాయబారి హావో యాంకీ అటు కేపీ శర్మ ఓలీ, ప్రచండతో భేటీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అయితే హావో యాంకీ ప్రతిపాదనను ప్రధాని శర్మ తిరస్కరించినట్లు తెలుస్తోంది. చైనా రాయబారి హావో యాంకీతో భేటీ కావడానికే తిరస్కరించిన ఓలీ… చైనా అధ్యక్షుడు పంపిన ప్రతినిధులతో భేటీ అవుతారా? అన్నది అనుమానమే అని ఆయన వర్గం పేర్కొంటోంది. తమ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటే కుదరదని ఇప్పటికే ఓలీ తెగేసి చెప్పారు.

అయితే చైనా రాయబారి ఓలీ క్యాంపు నేతలతో టచ్‌లోనే ఉన్నారని, కానీ… ఓలీ మాత్రం టచ్‌లోకి రావడం లేదని తెలుస్తోంది. ఓలీ ప్రత్యర్థి ప్రచండతో మాత్రం పలు దఫాలుగా చర్చలు జరిపింది. పార్లమెంట్‌ను రద్దు చేయాలంటూ ఓలీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ పార్లమెంట్‌ను రద్దు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!