దేశంలో కలవరపెడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్.. మార్చిలోనే అడుగుపెట్టిందన్న ఐజీఐబీ

చైనా నుంచి మొదలైన మాయదారి కరోనా నుంచి ఇప్పడిప్పుడే తెరుకుంటుండగా, రూపాంతరం చెందిన మరో వైరస్ బ్రిటన్, సౌతాఫ్రికా దేశాల్లో వెలుగుచూస్తోంది. తాజాగా కొత్త వైరస్ ప్రపంచ దేశాలను మరోమారు వణికిస్తుంది.

దేశంలో కలవరపెడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్.. మార్చిలోనే అడుగుపెట్టిందన్న  ఐజీఐబీ
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 26, 2020 | 10:03 PM

చైనా నుంచి మొదలైన మాయదారి కరోనా నుంచి ఇప్పడిప్పుడే తెరుకుంటుండగా, రూపాంతరం చెందిన మరో వైరస్ బ్రిటన్, సౌతాఫ్రికా దేశాల్లో వెలుగుచూస్తోంది. తాజాగా కొత్త వైరస్ ప్రపంచ దేశాలను మరోమారు వణికిస్తుంది. అయితే, కరోనా కొత్త వైరస్ నిజానికి ఈ ఏడాది మార్చిలోనే దేశంలోకి ప్రవేశించినట్టు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న కరోనా వైరస్‌కు భిన్నమైన రకాలను మార్చిలోనే శాస్త్రవేత్తలు గుర్తించారని ఆయన వెల్లడించారు. వాటిల్లో ఎ4 అనే వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీన్ని సూపర్ స్ప్రెడర్‌ అని సైంటిస్టులు గుర్తించినట్లు అనురాగ్ అగర్వాల్ వెల్లడించారు.

కొత్త రకం వైరస్ హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతాలలో సేకరించిన నమూనాల్లో ఈ ‘ఎ4’ మ్యుటేషన్ వైరస్ వెలుగు చూసింది. అయితే, మనలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడంతో జూన్ నాటికే ఈ సూపర్ స్ప్రెడర్ అంతమైందని ఆయన తెలిపారు. ఈ వైరస్ దేశంలో ప్రబలితే మరింత దారుణ పరిస్థితులు ఎదుర్కోవల్సి వచ్చేందని అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన, బ్రిటన్ కేంద్ర విస్తరిస్తున్న కొత్త వైరస్ స్ట్రెయిన్ మరింత వేగంగా విస్తరిస్తుండడంతో అప్రమత్తత ఉండాలని ఆయన హెచ్చరించారు. నిజానికి బ్రిటన్ కంటే ఇక్కడే వైరస్ ఉత్పరివర్తనాలు ఎక్కువన్న ఆయన ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్‌లు మ్యుటేషన్ వైరస్‌ను కూడా సమర్థంగా నిరోధిస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.