ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి..ప్రశాంతంగా ముగిసిన అంత్యక్రియలు
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి చెందాడు. జమీర్ అంత్యక్రియలు ఈ సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. తాటిగూడలో వారం క్రితం.. ఎంఐఎం నేత, మాజీ జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ తుపాకీ, కత్తితో వీరంగం..
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి చెందాడు. జమీర్ అంత్యక్రియలు ఈ సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. తాటిగూడలో వారం క్రితం.. ఎంఐఎం నేత, మాజీ జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ తుపాకీ, కత్తితో వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పాతకక్షలతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది.
మజ్లిస్ జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్… ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరపడంతో పాటు మరొకరిపై తల్వార్‌తో దాడిచేశాడు. కాల్పుల ఘటనలో జమీర్, మోతేషాన్ క్షతగాత్రులవ్వగా.. మన్నన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జమీర్‌ను నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
పిల్లలు క్రికెట్ ఆడటంతో.. మాటామాటా పెరిగి కాల్పులకు దారితీసింది. తొలుత పరస్పరం దాడులకు దిగిన క్రమంలో సహనం కోల్పోయిన మజ్లిస్ నేత ఫారూఖ్.. ఓ చేత్తో కత్తి, మరో చేత్తో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో జమీర్ శరీరంలోకి రెండు తూటాలు.. మన్నన్ , మోతేషాన్ శరీరాల్లో ఒక్కో తూటా దిగింది.
కుప్పకూలిన ఆ ముగ్గురిని స్థానికులు హుటాహుటినా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫారూఖ్‌ను వెంటనే అదుపులోకి తీసుకొని టూటౌన్ ఠాణాకి తరలించారు. ఆయన వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.