New Strain : యూకే నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్..రంగంలోకి దిగిన వైద్య అధికారులు

యూకే నుంచి 1214 మంది ఏపీకి వచ్చారని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన 1158 మందిని గుర్తించామని తెలిపారు. మరో 56 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరులో...

New Strain : యూకే నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్..రంగంలోకి దిగిన వైద్య అధికారులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 26, 2020 | 10:39 PM

New Strain :  యూకే నుంచి 1214 మంది ఏపీకి వచ్చారని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన 1158 మందిని గుర్తించామని తెలిపారు. మరో 56 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 1101 మందిని క్వారంటైన్ చేశామని, పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ పుణెలోని వైరాలజీ, హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపామని, ఇంకా నివేదికలు అందాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

మహమ్మారి కరోనా ఇప్పుడిప్పుడే శాంతిస్తోందని సంబరపడుతున్న రాష్ట్రంలో ‘కరోనా స్ట్రెయిన్‌’ కలవరపెడుతోంది. దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తుతోంది. బ్రిటన్‌తో పాటు మరో నాలుగైదు దేశాల్లో తన ప్రతాపం చూపుతుండటంతో యూకే నుంచి వస్తున్నా విమానాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ 70 శాతం ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదయినా కరోనా ప్రభావం కేవలం 20 శాతం ఉండగా, తాజా వైరస్‌ ప్రభావం ఇంతకు మూడు రెట్లకుపైగా ఉంటుంది.