అప్పటి వరకు చార్ ధామ్ యాత్రకు అనుమతులు లేవు!
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. మామూలుగా అయితే ఇది చార్‌థామ్ సీజన్, కానీ కరోనా వైరస్ నేపథ్యంలో ఆ యాత్రకు బ్రేక్ పడింది. గత నెల 15వ తేదీన కేదార్ నాథ్ తెరిచారు.

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. మామూలుగా అయితే ఇది చార్‌థామ్ సీజన్, కానీ కరోనా వైరస్ నేపథ్యంలో ఆ యాత్రకు బ్రేక్ పడింది. గత నెల 15వ తేదీన కేదార్ నాథ్ తెరిచారు. ఆ తర్వాత ఈనెల 30న బద్రీనాథ్ కూడా ఓపెన్ చేశారు. కానీ సాధారణ భక్తులకు మాత్రం ఇంకా చార్‌థామ్ యాత్రకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఆ యాత్రపై సందిగ్ధం నెలకొన్నది. అయితే చార్‌థామ్ యాత్రను ఈనెల 30వ తేదీ వరకు ప్రారంభించడం లేదని దేవస్థానం బోర్డు సీఈవో రవినాథ్ రమన్ తెలిపారు.
ఉత్తర భారతదేశంలోని, ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉన్న నాలుగు ఆలయాలను కలిపి చార్‌థామ్ యాత్రను నిర్వహిస్తున్నారు. యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను చార్‌ధామ్‌గా పేర్కొంటారు. యాత్రకు సంబంధించి ఇవాళ ఈ ఆలయాల పూజారులు, వాటాదారులు, హక్కుదారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాత్రను ఈనెల ౩౦వ తేదీ వరకు వాయిదా వేశారు.