బాబు హోదాపై వైసీపీ నజర్..వారంలో పని ఖతం?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాపై అధికార వైసీపీ గురి పెట్టిందా? అందుకు అనుగుణంగా వైసీపీ కార్యాచరణ మొదలుపెట్టిందా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే అధికార, విపక్షాల మధ్య ఘాటు, హాటు కామెంట్లతో సభ హోరెత్తింది. ఇదంతా మనకు తెరమీద కనిపిస్తున్న చిత్రం. కానీ తెర వెనుక రాజకీయం వేరే వుందంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సభలో తెలుగుదేశం పార్టీకి 22 […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాపై అధికార వైసీపీ గురి పెట్టిందా? అందుకు అనుగుణంగా వైసీపీ కార్యాచరణ మొదలుపెట్టిందా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే అధికార, విపక్షాల మధ్య ఘాటు, హాటు కామెంట్లతో సభ హోరెత్తింది. ఇదంతా మనకు తెరమీద కనిపిస్తున్న చిత్రం. కానీ తెర వెనుక రాజకీయం వేరే వుందంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం సభలో తెలుగుదేశం పార్టీకి 22 మంది సభ్యులున్నారు. నిజానికి ఆర్నెల్ల క్రితం ఎన్నికల్లో 23 మంది గెలిచినా వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారు. సోమవారం సభ ప్రారంభానికి ముందు వంశీని టీడీఎల్పీ కార్యాలయంలోకి ఆహ్వానించినా ఆయన అటువైపు అడుగు వేయలేదు.
అయితే, తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలపై వైసీపీ గురిపెట్టిందని సమాచారం. శీతాకాల సమావేశాలు ముగిసేలోగా.. టీడీపీ ఎమ్మెల్యేల్లో కనీసం ఆరుగురిని లాగేసేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నదని అమరావతి వర్గాల భోగట్టా. అంటే ఇప్పుడున్న 22 మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలు చేజారితే.. టీడీపీ సభ్యుల సంఖ్య 16కి పడిపోతుంది.
మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీకి కేవలం 16 మంది అంటే పది శాతం కంటే తక్కువ సభ్యులు మిగులుతారు. దాంతో ప్రతిపక్ష నేత హోదా (ఆల్‌మోస్ట్ కేబినెట్ ర్యాంక్)కు చంద్రబాబు దూరమవుతారు. ఓ సాధారణ ఫ్లోర్ లీడర్ స్థాయికి చంద్రబాబు హోదా పడిపోతుంది. ఇలా జరిగితే బాబు నైతికంగా, మానసికంగా ఇక కోలుకోలేరని.. దాంతో దశాబ్ధకాలం పాటు తమదే అధికారమని వైసీపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.