కోహ్లీ ఔట్.. విలియమ్స్ ‘నోట్‌బుక్’ ఎక్కడ పోయిందో..!

వెస్టిండీస్ పేసర్ క్రెసిక్ విలియమ్స్‌‌కు ఓ అలవాటు ఉంది. బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయగానే ఓ పని అయిపోయినట్లుగా తన జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి టిక్కు పెట్టడం అతడికి అలవాటు. అయితే ఆదివారం తిరువనంతపురం వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విభిన్నంగా సంబరాలు జరుపుకున్నాడు విలియమ్స్. టీమిండియా కెప్టెన్ కోహ్లీని ఔట్ చేసిన తరువాత జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీయకుండా ష్.. అంటూ నోటి మీద వేలేసుకొని సంబరాలు జరుపుకున్నాడు విలియమ్స్. అయితే దీనికో కారణం […]

కోహ్లీ ఔట్.. విలియమ్స్ 'నోట్‌బుక్' ఎక్కడ పోయిందో..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 09, 2019 | 8:48 PM

వెస్టిండీస్ పేసర్ క్రెసిక్ విలియమ్స్‌‌కు ఓ అలవాటు ఉంది. బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయగానే ఓ పని అయిపోయినట్లుగా తన జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి టిక్కు పెట్టడం అతడికి అలవాటు. అయితే ఆదివారం తిరువనంతపురం వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విభిన్నంగా సంబరాలు జరుపుకున్నాడు విలియమ్స్. టీమిండియా కెప్టెన్ కోహ్లీని ఔట్ చేసిన తరువాత జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీయకుండా ష్.. అంటూ నోటి మీద వేలేసుకొని సంబరాలు జరుపుకున్నాడు విలియమ్స్.

అయితే దీనికో కారణం ఉంది. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో విలియమ్స్‌ బౌలింగ్‌లో పరుగుల వరద పారించాడు కోహ్లీ. ఆ సమయంలో విలియమ్స్‌ను అనుకరిస్తూ కోహ్లీ బదులిచ్చాడు. దీంతో రెండో టీ 20లో కోహ్లీని ఔట్ చేసిన విలియమ్స్.. ఎప్పటిలా కాకుండా వినూత్న రీతిలో సంబరాలు జరుపుకున్నాడు. కాగా కొందరేమో ఈసారి విలియమ్స్, కోహ్లీని అనుకరించాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మొదటి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో టీ20లో 8వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ఈ రెండు టీమ్‌ల బుధవారం మూడో టీ 20 ముంబైలో జరగనుంది.