స్టేడియంలో ఎంటర్‌ అయిన స్నేక్.. షాక్ తిన్న ఆటగాళ్లు..

అనుకోని అతిథి.. ఆ మ్యాచ్‌లో ఎంటర్‌ అయ్యి మ్యాచ్‌కి అంతరాయం కల్గించింది. అంతేకాదు.. ఆ అతిథి ఎంటర్ అవ్వడంతో.. గ్రౌండ్‌లో ఉన్నవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన షాక్ కల్గిస్తోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని క్రికెట్ స్టేడియంలో…2019-20 రంజీ ట్రోఫీ సీజన్‌ మ్యాచ్‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. గ్రూప్‌-ఏలో భాగంగా ఆంధ్ర – విదర్భ జట్ల మధ్య.. సోమవారం ఉదయం మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ గెలిచిన విదర్భ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన […]

స్టేడియంలో ఎంటర్‌ అయిన స్నేక్.. షాక్ తిన్న ఆటగాళ్లు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 09, 2019 | 8:01 PM

అనుకోని అతిథి.. ఆ మ్యాచ్‌లో ఎంటర్‌ అయ్యి మ్యాచ్‌కి అంతరాయం కల్గించింది. అంతేకాదు.. ఆ అతిథి ఎంటర్ అవ్వడంతో.. గ్రౌండ్‌లో ఉన్నవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన షాక్ కల్గిస్తోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని క్రికెట్ స్టేడియంలో…2019-20 రంజీ ట్రోఫీ సీజన్‌ మ్యాచ్‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. గ్రూప్‌-ఏలో భాగంగా ఆంధ్ర – విదర్భ జట్ల మధ్య.. సోమవారం ఉదయం మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ గెలిచిన విదర్భ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే.. స్టేడియంలో సడన్‌గా ఓ పాము ప్రత్యక్షమైంది. దీంతో ఫీల్డింగ్‌ చేస్తున్న ఆటగాళ్లు.. ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో మ్యాచ్‌కు కాసేపు బ్రేకులు పడ్డాయి. కాసేపటికి పామును స్టేడియం నుంచి బయటకు పంపించిన అనంతరం.. అంపైర్లు తిరిగి మ్యాచ్‌ను ప్రారంభించారు. అయితే స్టేడియంలోకి పాము ఎంటరైన వీడియోను.. బీసీసీఐ డొమెస్టిక్.. తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.