సైకిల్ నేలమీద..హ్యాండిల్ ఆకాశంలో..ఎక్కేదెవరు? తొక్కేదెవరు?
మనం చాలా రకాల సైకిళ్లను చూశాం..చిన్న పిల్లలు ఆడుకునే సైకిళ్ల నుంచి పెద్దవాళ్లు తొక్కేవి, క్రీడాకారుల సైకిళ్లు అనేక రకాలుగా ఉంటాయి. కానీ, ఇక్కడ మీరు చూస్తున్న సైకిల్ మాత్రం అన్నింటి కంటే భిన్నమైంది. ఈ సైకిల్ ఎక్కి తొక్కడం అంటే నిజంగానే ధైర్యం ఉండాలంటున్నారు దానిని చూసిన వారందరూ. ఎందుకంటే, అది ఓ ఎత్తైన భారీ క్రేన్‌ను తలపించేలా ఉంది. 15 అడుగుల ఎత్తు కలిగి నేలపైన చక్రాలు, ఎక్కడో ఆకాశంలో ఉన్న హ్యాండిల్ పట్టుకుని […]
మనం చాలా రకాల సైకిళ్లను చూశాం..చిన్న పిల్లలు ఆడుకునే సైకిళ్ల నుంచి పెద్దవాళ్లు తొక్కేవి, క్రీడాకారుల సైకిళ్లు అనేక రకాలుగా ఉంటాయి. కానీ, ఇక్కడ మీరు చూస్తున్న సైకిల్ మాత్రం అన్నింటి కంటే భిన్నమైంది. ఈ సైకిల్ ఎక్కి తొక్కడం అంటే నిజంగానే ధైర్యం ఉండాలంటున్నారు దానిని చూసిన వారందరూ.
ఎందుకంటే, అది ఓ ఎత్తైన భారీ క్రేన్‌ను తలపించేలా ఉంది. 15 అడుగుల ఎత్తు కలిగి నేలపైన చక్రాలు, ఎక్కడో ఆకాశంలో ఉన్న హ్యాండిల్ పట్టుకుని ఓ యువకుడు అవలీలగా తొక్కేస్తున్నాడు. అంత ఎత్తైన సైకిల్ తొక్కాలంటే..ఆ యువకుడి కాళ్లు కూడా అంతే పొడవు ఉన్నాయకుంటున్నారా..అయితే, మీరు పొరబడినట్లే…ఎవరికీ అంత పొడవైన కాళ్లు ఉండవు, కాబట్టి..పెడల్‌ను కూడా అందుబాటు ఎత్తులోనే పెట్టారు. ఇక దానిని తోస్తూ..నిచ్చేన ఎక్కినంత సులభంగా సైకిల్ ఎక్కి తొక్కేస్తున్న ఆ యువకుడిని కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో క్షణాల్లో వైరల్‌గా మారిన ఆ వీడియో లక్షల సంఖ్యలో వ్యూయర్స్‌ని సంపాదించుకుంది. ఆ వీడియో ఇప్పుడు మీరు చూడండి..
Basikal tu style satu hal , cara dia naik tu lagi satu hal bapak ahhh pic.twitter.com/sq0aw96ChW
— Kakarot (@aimanmokhtar11) November 28, 2019