ఆర్జీవీపై కేఏపాల్‌ కోడలి ఫిర్యాదుః సీసీఎస్‌లో కేసు నమోదు

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై మరో కేసు నమోదయింది.”అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్‌ చిక్కులు వీడి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమయంలో వర్మను మరో వివాదం చుట్టుముట్టింది. సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేఏ పాల్ కోడలు బెగాల్ […]

ఆర్జీవీపై  కేఏపాల్‌ కోడలి ఫిర్యాదుః సీసీఎస్‌లో కేసు నమోదు
Follow us
Anil kumar poka

| Edited By: Srinu

Updated on: Dec 10, 2019 | 12:39 PM

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై మరో కేసు నమోదయింది.”అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్‌ చిక్కులు వీడి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమయంలో వర్మను మరో వివాదం చుట్టుముట్టింది. సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్స్‌లో కేసు నమోదయింది. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే ఏ పాల్‌ కోడలు జ్యోతి.. వర్మపై ఫిర్యాదు చేసింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్‌కు ఆర్జీవీ తమ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో దిగిన ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారన్న ఆమె.. అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపింది. పోలీసులు వర్మపై ఐపీసీ సెక్షన్‌ 469పై కేసు నమోదు చేశారు.