టీవీ షో నిర్మాతగా ధోని.. ఇక క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనా.?

అంతర్జాతీయ క్రికెట్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యి.. ఎన్నో అపురూప విజయాలు, రికార్డులు తెచ్చిపెట్టిన ధోని.. ఇండియన్ ఆర్మీ పట్ల తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ వచ్చాడు. రీసెంట్‌గా వన్డే వరల్డ్‌కప్ అనంతరం ఆర్మీతో రెండు నెలలు పని చేసిన ధోని.. ఇప్పుడు మరోసారి సైనికుల కోసం బృహత్తకార్యం చేపట్టేందుకు కంకణం కట్టుకున్నాడు. ప్రస్తుతం ధోని ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందాడు. ఈ నేపథ్యంలో సైనికులు […]

టీవీ షో నిర్మాతగా ధోని.. ఇక క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనా.?
Ravi Kiran

|

Dec 10, 2019 | 3:48 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యి.. ఎన్నో అపురూప విజయాలు, రికార్డులు తెచ్చిపెట్టిన ధోని.. ఇండియన్ ఆర్మీ పట్ల తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ వచ్చాడు. రీసెంట్‌గా వన్డే వరల్డ్‌కప్ అనంతరం ఆర్మీతో రెండు నెలలు పని చేసిన ధోని.. ఇప్పుడు మరోసారి సైనికుల కోసం బృహత్తకార్యం చేపట్టేందుకు కంకణం కట్టుకున్నాడు. ప్రస్తుతం ధోని ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందాడు.

ఈ నేపథ్యంలో సైనికులు బోర్డర్ దగ్గర ఎదుర్కుంటున్న సమస్యలు, వారి కుటుంబ సభ్యుల కష్టాలు వివరిస్తూ ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని రంగం సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఎలాగో గతంలో ధోని వారితో పని చేశాడు కాబట్టి..  దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు, అపారమైన కృషి పట్ల కొంత అవగాహన ఏర్పడింది. ఇక వాటన్నింటిని జనాలకు చూపించాలని సిద్దమయ్యాడు. అంతేకాకుండా అమరవీరులైన సైనికులే కాకుండా ఆర్మీలో అత్యున్నత అవార్డులు పొందిన సైనికాధికారుల లేక సిబ్బంది జీవితాలను ఈ షో ప్రతిబింబిస్తుందని తెలుస్తోంది. ఈ షో స్టార్ ప్లస్‌ ఛానల్‌లో ప్రసారమవుతుందని సమాచారం. కాగా, ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ధోని కెరీర్ ఇక ముగిసిందని జనవరిలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. అంతేకాకుండా మిస్టర్ కూల్ ఇకపై ప్రజాసేవకు అంకితమవుతాడాన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ధోని తీసుకునే తదుపరి అడుగు ఎటు వైపు ఉంటుందో..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu