గ్రౌండ్‌లోనే బిడ్డకు పాలిచ్చిన ప్లేయర్..సెల్యూట్..!

అమ్మతోనే ప్రపంచం..అమ్మే ప్రపంచం. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇదే విషయాన్ని మరోసారి చాటిచెప్పింది మిజోరంకు చెందిన వాలీబాల్‌ ప్లేయర్‌ లాల్‌వెంట్‌ లుయాంగీ. మ్యాచ్ బ్రేక్ టైంలో తన  బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చింది. మిజోరాం స్టేట్ గేమ్స్ 2019 సందర్భంగా ఈ అద్భుత దృష్యం ఆవిష్కృతమైంది. ఆకలితో బిడ్డ ఏడ్వడం గమనించిన లుయాంగీ పరిగెత్తుకుంటూ వెళ్లి స్టేడియంలోనే పాలిచ్చిన సందర్భం అమ్మ ప్రేమలోని ఆర్థతను తెలియజేస్తోంది. అనంతరం తిరిగి ఆటను కొనసాగించిన ఈ […]

గ్రౌండ్‌లోనే బిడ్డకు పాలిచ్చిన ప్లేయర్..సెల్యూట్..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 11, 2019 | 8:09 AM

అమ్మతోనే ప్రపంచం..అమ్మే ప్రపంచం. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇదే విషయాన్ని మరోసారి చాటిచెప్పింది మిజోరంకు చెందిన వాలీబాల్‌ ప్లేయర్‌ లాల్‌వెంట్‌ లుయాంగీ. మ్యాచ్ బ్రేక్ టైంలో తన  బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చింది. మిజోరాం స్టేట్ గేమ్స్ 2019 సందర్భంగా ఈ అద్భుత దృష్యం ఆవిష్కృతమైంది. ఆకలితో బిడ్డ ఏడ్వడం గమనించిన లుయాంగీ పరిగెత్తుకుంటూ వెళ్లి స్టేడియంలోనే పాలిచ్చిన సందర్భం అమ్మ ప్రేమలోని ఆర్థతను తెలియజేస్తోంది. అనంతరం తిరిగి ఆటను కొనసాగించిన ఈ ప్లేయర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. లాల్వెంట్ లుయాంగీ… అమ్మ గొప్పదనం  తెలియజెప్పారని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా… ఒకవైపు ప్లేయర్‌గా, మరోవైపు తల్లిగా ఆమె రెండు కర్తవ్యాలకు న్యాయం చేసిందని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

నింగ్లున్ హంగల్ అనే వ్యక్తి ఈ పిక్‌ను ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసి ముగ్దుడైన మిజోరం క్రీడాశాఖ మంత్రి రోమావియా.. ఆమెను ప్రశంసించడంతో పాటు రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.