AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెండున్నర లక్షల మాస్క్‌లు పంపిణీ..

పంట నష్టంపై సీఎం రివ్యూలో మినిస్ట‌ర్స్ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమ‌ర్శించారు. పార్టీ నాయ‌కుల‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు… తమకు జరిగిన నష్టంపై రైతులే సెల్ఫీ వీడియోలు తీసి పంపించటం వారి మనోవేదనకు సాక్ష్యాలని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతు పండించింది పుచ్చకాయ కాదు.. కర్బూజ అని, న్యూస్ పేప‌ర్ లో వచ్చినవి పాత ఫొటోలని మంత్రి అబద్దాలు చెప్పడం అవ‌మాన‌క‌ర‌మ‌న్నారు. పాలకుల అహంకారం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందని ఆరోపించారు. […]

ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెండున్నర లక్షల మాస్క్‌లు పంపిణీ..
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2020 | 10:42 PM

Share

పంట నష్టంపై సీఎం రివ్యూలో మినిస్ట‌ర్స్ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమ‌ర్శించారు. పార్టీ నాయ‌కుల‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు… తమకు జరిగిన నష్టంపై రైతులే సెల్ఫీ వీడియోలు తీసి పంపించటం వారి మనోవేదనకు సాక్ష్యాలని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతు పండించింది పుచ్చకాయ కాదు.. కర్బూజ అని, న్యూస్ పేప‌ర్ లో వచ్చినవి పాత ఫొటోలని మంత్రి అబద్దాలు చెప్పడం అవ‌మాన‌క‌ర‌మ‌న్నారు. పాలకుల అహంకారం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందని ఆరోపించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెండున్నర లక్షల మాస్క్‌లు పంపిణీ చేస్తామని బాబు వెల్ల‌డించారు. , కరోనా వ్యాప్తి నివారణలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సిబ్బందికి వాటిని అందజేయాలని చంద్రబాబు సూచించారు. తూర్పుగోదావరి మన్యంలో కాలువాపు వ్యాధితో ఆరుగురు మృతి చెందారని ఆ జిల్లా నేతలు చంద్రబాబుకు కంప్లైంట్ చేశారు. లాక్‌డౌన్ రూల్స్ అతిక్ర‌మించి… స్పీకర్‌ తమ్మినేని సీతారాం బహిరంగ సభ నిర్వహించారని కూన రవికుమార్‌ తెలిపారు.

Follow Us