ఎంపీల పార్టీ మార్పుపై చంద్రబాబు ఫైర్!

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఈ చేరికలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో అటు టీడీపీని వీడిన ఎంపీలపై.. బీజేపీపై తీవ్రస్థాయిలో […]

ఎంపీల పార్టీ మార్పుపై చంద్రబాబు ఫైర్!
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 10:28 PM

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఈ చేరికలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో అటు టీడీపీని వీడిన ఎంపీలపై.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి కార్యకర్తలు, ప్రజలే అండఅని,  నలుగురు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదని.. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడిందని.. అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బీజేపీ పాల్పడటం గర్హనీయమని నారా చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించారు.