నేడు 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
యోగా.. ఏ టూ జెడ్.. ఏ సమస్యలకైనా పరిష్కారం. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తారకమంత్రం. టెక్నాలజీలేవీ పుట్టకముందే పుట్టిన యోగా.. నేడు ఐదవ పండుగరోజు జరుపుకుంటోంది. ఏడాదిలోని 365 రోజుల్లో పగటి పూట ఎక్కువ ఉండే రోజు జూన్ 21. ఈ తేదీనే ప్రపంచం మొత్తం యోగా సంబరాల్లో మునిగిపోయింది. జీవితం యాంత్రికంగా మారిన రోజులివి. తరతమ బేధాలేవి లేకుండా యావత్ ప్రపంచ ప్రజలు ఒత్తిడిలో బ్రతుకుతున్నారు. వీటన్నిటినుంచీ మనిషికి ఉపశమనం ఇచ్చేది యోగానే. ప్రపంచాన్ని […]

యోగా.. ఏ టూ జెడ్.. ఏ సమస్యలకైనా పరిష్కారం. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తారకమంత్రం. టెక్నాలజీలేవీ పుట్టకముందే పుట్టిన యోగా.. నేడు ఐదవ పండుగరోజు జరుపుకుంటోంది. ఏడాదిలోని 365 రోజుల్లో పగటి పూట ఎక్కువ ఉండే రోజు జూన్ 21. ఈ తేదీనే ప్రపంచం మొత్తం యోగా సంబరాల్లో మునిగిపోయింది.
జీవితం యాంత్రికంగా మారిన రోజులివి. తరతమ బేధాలేవి లేకుండా యావత్ ప్రపంచ ప్రజలు ఒత్తిడిలో బ్రతుకుతున్నారు. వీటన్నిటినుంచీ మనిషికి ఉపశమనం ఇచ్చేది యోగానే. ప్రపంచాన్ని రక్షించే శక్తి అణుబాంబులకు కూడా లేదు. ఒక్క యోగాకి మాత్రమే ఉందని ప్రపంచం యూవత్తూ బలంగా నమ్ముతోంది.



