AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#HBDMegastarChiranjeevi: చంద్రబాబు, నారా లోకేష్ బర్త్‌డే విషెస్!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకి విషెస్ ఏ స్థాయిలో అందిస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సెలబ్రెటీలు కూడా మెగాస్టార్ కి తమ స్టైల్ లో శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్నేహ భావాన్ని చాటుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో […]

#HBDMegastarChiranjeevi: చంద్రబాబు, నారా లోకేష్ బర్త్‌డే విషెస్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2019 | 1:33 PM

Share

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకి విషెస్ ఏ స్థాయిలో అందిస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సెలబ్రెటీలు కూడా మెగాస్టార్ కి తమ స్టైల్ లో శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్నేహ భావాన్ని చాటుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్న చంద్రబాబు మెగాస్టార్ తో నవ్వుతూ ఉన్న ఫొటోని కూడా షేర్ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మెగాస్టార్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ఇంటిల్లిపాదికీ వినోదాన్ని అందించే విభిన్నపాత్రలలో నటించి, ప్రేక్షకహృదయాలలో చెరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారు చిరంజీవిగారు. పట్టుదల, కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించి, ఎందరికో స్ఫూర్తిగా నిలచిన చిరంజీవిగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే