చిదంబరం కేసులో ఇంద్రాణి ముఖర్జియా రోల్ ?

చిదంబరం కేసులో ఇంద్రాణి ముఖర్జియా రోల్ ?

మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం పై దాఖలైన కేసు ఏమిటి ? అసలెందుకు ఇది ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది ? ఆయన చుట్టూ ఉచ్ఛు బిగియడానికి దారి తీసిన కారణాలేమిటి ? దీని వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. 2007 నాటి కేసుతో ఇది ముడిపడిఉంది. నాడు మీడియా ఎంటర్ ప్రెన్యూర్స్ పీటర్ ముఖర్జియా, అతని భార్య ఇంద్రాణి ముఖర్జియాల ఆధ్వర్యంలోని ఐ ఎన్ ఎక్స్ మీడియాకు, అప్పటి ఆర్ధికమంత్రి చిదంబరానికి మధ్య […]

Anil kumar poka

|

Aug 22, 2019 | 12:54 PM

మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం పై దాఖలైన కేసు ఏమిటి ? అసలెందుకు ఇది ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది ? ఆయన చుట్టూ ఉచ్ఛు బిగియడానికి దారి తీసిన కారణాలేమిటి ? దీని వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. 2007 నాటి కేసుతో ఇది ముడిపడిఉంది. నాడు మీడియా ఎంటర్ ప్రెన్యూర్స్ పీటర్ ముఖర్జియా, అతని భార్య ఇంద్రాణి ముఖర్జియాల ఆధ్వర్యంలోని ఐ ఎన్ ఎక్స్ మీడియాకు, అప్పటి ఆర్ధికమంత్రి చిదంబరానికి మధ్య నడిచిన యవ్వారమిది ! (తన మాజీ భర్త కూతురు షీనా బోరా మర్డర్ కేసులో ఇంద్రాణి ముఖర్జియా ముంబై జైల్లో శిక్ష అనిభావిస్తోంది. ఆమె రెండో భర్త పీటర్ కూడా అదే జైల్లో ఖైదీగా ఉన్నాడు).

2007 లో ఐ ఎన్ ఎస్ మీడియా నిర్వహించిన న్యూస్ చానెళ్లకు షేర్ల బదలాయింపునకు సంబంధించి నాటి ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఆ శాఖలోని ఇంటలిజెన్స్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (అప్పట్లో చిదంబరం పవర్ ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్.) ఐ ఎన్ ఎక్స్ మీడియాలో మారిషస్ కు చెందిన మూడు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అయితే ఇందులో దాదాపు 305 కోట్ల పెట్టుబడుల వ్యవహారంలో ‘ అవకతవకలు ‘ జరిగినట్టు ముంబైలోని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఈ కేసును ఈడీకి అప్పగించింది. దీంతో ఇందులో మనీలాండరింగ్ జరిగిందా అన్నదానిపై ఈడీతో బాటు సీబీఐ కూడా దర్యాప్తు ప్రారంభించింది. కేంద్రంలో నాడు అత్యంత ‘ పలుకుబడి కలిగిన వ్యక్తులు ‘ అవినీతికి పాల్పడ్డారని ఈడీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది.

నాడు న్యూస్ చానెళ్లకు పెట్టుబడులు పెట్టడానికి 14. 9 లక్షల ఈక్విటీ షేర్లను, 31. 22 లక్షల కన్వర్థబుల్ నాన్-క్యుమ్యులేటివ్ రీడమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను జారీ చేసేందుకు అనుమతించాలని ఐ ఎన్ ఎక్స్ మీడియా ఆర్ధిక శాఖకు దరఖాస్తు పెట్టుకుంది. (ప్రతి షేరు 10 రూపాయల ముఖ విలువ గలదట ). ఎఫ్ డీ ఐ ‘ రూట్ ‘ కింద ముగ్గురు నాన్-రెసిడెంట్ ఇన్వెస్టర్లు ఈ మూడు కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారు. వారి అభ్యర్థనను ఆర్ధిక శాఖలోని ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు అదే ఏడాది మే నెలలో ఆమోదించింది. అంటే ఐ ఎన్ ఎక్స్ మీడియా సంస్థ రూ. 4. 62 కోట్ల విదేశీ నిధులను (ఆ ఒక్క ఏడాదిలోనే) పొందడానికి మార్గం సుగమమైంది. అయితే తన ఆధ్వర్యంలోని న్యూస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ కోసమంటూ ఈ సంస్థ పెట్టుకున్న మరో దరఖాస్తును ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించింది. మారిషస్ కు చెందిన ఈ మూడు కంపెనీలు ఈ బోర్డును పక్కనబెట్టి.. రూ. 305 కోట్లను (అక్రమంగా) పొందగలిగాయి.

2017 మే నెలలో ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబందించి సీబీఐ ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసింది. దీంతో బాటు ఆ తరువాత ఈడీ కూడా మరో కేసు పెట్టింది. ఇదే కేసులో ఇంద్రాణి ముఖర్జియా అప్రూవర్ గా మారడంతో సీబీఐవాదనకు బలం చేకూరింది. 2008 లో అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని తాను కలిశానని, ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు నుంచి క్లియరెన్స్ ఇప్పించాల్సిందిగా ఆయనను కోరానని, దీంతో తమ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆమె తెలిపింది. పైగా చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి తాను ముడుపులు చెల్లించినట్టు ఇంద్రాణి 2018 మార్చి నెలలో ప్రకటించింది కూడా.. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ, సీబీఐ గుర్తించాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu