Covid-19: ఇంట్లో ఉన్నా.. మాస్క్ ధరించాల్సిందే.. లేకపోతే అందరికీ కరోనా.. నీతి ఆయోగ్ కీలక ప్రకటన
NITI Aayog - Mask: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం
NITI Aayog – Mask: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంట్లోనూ మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లవద్దని.. కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తిస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే మిగతా వాళ్లంతా ఇంట్లోనూ మాస్కులు ధరించాలని సూచించారు. వాస్తవానికి అందరూ ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకుంటే మంచిదని వీకే పాల్ సలహా ఇచ్చారు.
కరోనా సోకిన వ్యక్తి కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని కోరారు. దీంతోపాటు ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఒకచోట కూర్చున్నప్పుడు మాస్కులు పెట్టుకుంటే మంచిదని సూచించారు. కరోనా సోకిన వ్యక్తి ప్రత్యేకంగా మరో గదిలో ఉండాలని (హోం ఐసోలేషన్) ఆయన పేర్కొన్నారు. ఏమాత్రం లక్షణాలు ఉన్నా.. రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలంటూ వీకే పాల్ సలహా ఇచ్చారు. ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ వచ్చినా.. అప్పటికే లక్షణాలు ఉంటే పాజిటివ్‌గానే భావించి అందరికీ దూరంగా ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే.. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా మాస్కులు ధరించకపోవడం కలిగే ముప్పు గురించి ప్రస్తావించారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకపోతే ఇన్ఫెక్షన్ సోకే ముప్పు 90 శాతం ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిబంధనలు, మార్గదర్శకాలు కచ్చితంగా పాటిస్తేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయొచ్చని అగర్వాల్ పేర్కొన్నారు.
Also Read: