AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ సెంటర్ గా ఫైవ్ స్టార్ హోటల్, ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ అధికారులకు ప్రత్యేకం

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ని కోవిడ్ సెంటర్ గా మార్చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ అధికారులు, వారి కుటుంబాలకోసం ఈ  హోటల్ ని ఎంపిక చేశారు.

కోవిడ్ సెంటర్ గా ఫైవ్ స్టార్ హోటల్, ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ అధికారులకు ప్రత్యేకం
Covid Centers
Umakanth Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 27, 2021 | 8:55 AM

Share

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ని కోవిడ్ సెంటర్ గా మార్చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ అధికారులు, వారి కుటుంబాలకోసం ఈ  హోటల్ ని ఎంపిక చేశారు. సెంట్రల్ ఢిల్లీలో గల అశోకా హోటల్ లో 100 గదులు ఉన్నాయి. వీటిని అప్పుడే   బుక్ చేసినట్టు   చాణక్యపురి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గీతా గ్రోవర్   తెలిపారు. ఇందులో కోవిద్ కేర్ సర్వీసులను ప్రైమస్ హాస్పిటల్ నిర్వహిస్తుందని, ఈ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అశోకా హోటల్ లో తమ సేవలందిస్తారని గీతా గ్రోవర్ చెప్పారు. ఈ ఆసుపత్రి వైద్య సిబ్బంది తమ తమ డిమాండును బట్టి తమ ‘రేట్లను’ నిర్ధారించుకోవచ్చునట. అంటే వీరి సర్వీసు, అనుభవం బట్టి వీరి ‘ పారితోషికాలను’హాస్పిటల్ నిర్ణయిస్తుంది. సహజంగానే ఒక్కొక్కరు తమ సీనియారిటీని బట్టి డిమాండ్ చేసే అవకాశం ఉంది. జడ్జీలు, వారి కుటుంబాలకోసం  హాస్పిటల్ అంబులెన్స్ ని  రెడీగా ఉంచుతుంది.

అశోకా హోటల్   స్టాఫ్ కి అప్పుడే తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందని, అలాగే వారి కి పీపీఈ కిట్లు తదితరాలను సమకూరుస్తామని గీతా గ్రోవర్ తెలిపారు. కోర్టు న్యాయమూర్తులు, జుడిషియల్ అధికారులకు ఓ ఫైవ్ స్టార్ హోటల్ ని కోవిడ్  సెంటర్ గా మార్చడం ఇదే మొదటిసారి.  ఢిల్లీలో కోవిడ్  పెరిగి పోతున్నాయి. నిన్న ఒక్కరోజే 20 వేలకేసులు -నమోదు కాగా 380 మంది రోగులు మృతి  చెందారు. అయితే ఆసుపత్రులు మెల్లగా ఆక్సిజన్ కొరతను తీర్చుకుంటున్నాయి.  యుధ్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ సిలిండర్లు వస్తుండడంతో చాలావరకు పరిస్థితి మెరుగుపడుతోందని ఆయా  వర్గాలు తెలిపాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19: ఇంట్లో ఉన్నా.. మాస్క్ ధరించాల్సిందే.. లేకపోతే అందరికీ కరోనా.. నీతి ఆయోగ్ కీలక ప్రకటన

Horoscope Today: ఈ రాశుల వారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..