సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 33 శాతం సిలబస్ తగ్గింపు..!
ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవుతున్న క్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మహమ్మారి కారణంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్యారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవుతున్న క్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా అత్యవసర జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించిన సీబీఎస్ఈ అధికారులు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
ఇందులో భాగంగానే కొత్త విద్యా సంవత్సరం(2020-21)లో 33 శాతం సిలబస్‌ను తగ్గించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. 1వ తరగతి నుంచి 8 తరగతి వరకు పాఠశాలలే సిలబస్‌ను తగ్గించవచ్చునని తెలిపింది. ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తగ్గించిన సిలబస్‌కు సంబంధించిన సర్కిలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామంది. అటు క్వశ్చన్ పేపర్‌లో కూడా 50 శాతం మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలను ఇవ్వాలని, మిగిలిన థియరీ బేస్డ్ ఉంచాలని యోచిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఇంటి వద్ద నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించేలా మార్పులు చేసేందుకు సీబీఎస్ఈ సిద్ధమైంది. దీని కోసం పాఠశాలల యాజమాన్యాలు డిజిటల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా 10, 12వ తరగతుల సీబీఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలు జూలై 15న వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది చదవండి: ఆ 5 లక్షల మందికి ‘రైతు బంద్’.. తెలంగాణ సర్కార్ నిర్ణయం..