సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ  10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు దేశ వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. మొత్తం 91.1 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. cbse.nic.in , cbseresults.nic.in అనే వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ.. కాస్త ముందే ఫలితాలను ప్రకటించారు. 500 మార్కులకు గాను 499 మార్కులను […]

సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల
CBSE
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 06, 2019 | 3:50 PM

సీబీఎస్ఈ  10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు దేశ వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. మొత్తం 91.1 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. cbse.nic.in , cbseresults.nic.in అనే వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ.. కాస్త ముందే ఫలితాలను ప్రకటించారు.

500 మార్కులకు గాను 499 మార్కులను తెచ్చుకున్న 13 మంది విద్యార్థులు మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. 498 మార్కులను సాధించిన 24 మంది రెండో ర్యాంకును.. 497 మార్కులతో 58 మంది విద్యార్థులు మూడో ర్యాంక్‌ను పంచుకున్నారు.