విద్యార్థిని ప్రాణం తీసిన ఈవ్‌టీజింగ్

విద్యార్థిని ప్రాణం తీసిన ఈవ్‌టీజింగ్

అమెరికాలో ఉన్నత విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలించింది. కానీ, ఇంతలో కరోనా కారణంగా స్వదేశానికి రావడమే తన పాలిట శాపమైంది. ఇద్దరు ఆకతాయి కుర్రాళ్ల వెకిలిచేష్టలకు ఆమె ప్రాణాలు బలయ్యాయి. ఆమెపై కోటి ఆశలు పెట్టుకున్న కుటుంబానికి గర్భశోకాన్ని మిగిల్చి వెళ్లిపొయింది.

Balaraju Goud

|

Aug 11, 2020 | 4:23 PM

చదవులో తనకు సాటి లేదనిపించుకుంది. అన్ని అవాంతరాలను దాటుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలించింది. కానీ, ఇంతలో కరోనా కారణంగా స్వదేశానికి రావడమే తన పాలిట శాపమైంది. ఇద్దరు ఆకతాయి కుర్రాళ్ల వెకిలిచేష్టలకు ఆమె ప్రాణాలు బలయ్యాయి. ఆమెపై కోటి ఆశలు పెట్టుకున్న కుటుంబానికి గర్భశోకాన్ని మిగిల్చి వెళ్లిపొయింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌శహర్‌కు చెందిన సుదీక్షా భాటి(20) చదువుల్లో మేటి. 2018లో 12వ తరగతి సీబీఎస్‌సీ పరీక్షల్లో 98 శాతం మార్కులు సాధించింది. తన ప్రతిభకు మెచ్చి అమెరికా విద్యాసంస్థనే దిగివచ్చింది. హ్యుమానిటీస్‌ విభాగంలో మసాచుసెట్స్‌లోని బాబ్సన్‌ కళాశాల పూర్తి స్థాయి స్కాలర్ షిప్‌ను అందించింది. అప్పటినుంచి అక్కడే తన చదువును కొనసాగిస్తోన్న ఆమె.. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా అమెరికా నుంచి సొంతూరుకు చేరుకుంది. పరిస్థితులు చక్కబడితే ఆగస్టులో తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతోంది. కానీ, ఇంతలోనే ఆమె ఈవ్ టీజింగ్ భూతానికి బలైంది.

ఇది వరకు తాను చదువుకున్న పాఠశాల నుంచి అవసరమైన సర్టిఫికేట్స్ తెచ్చుకోడానికి బంధువుతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరింది. అటుగా మరో మోటార్ బైక్ మీద వచ్చిన ఇద్దరు పోకిరీలు వెలికి చేష్టలు చేస్తూ, స్టంట్లు, విన్యాసాలు ప్రదర్శిస్తూ వాహనానంతో ఢీకొట్టారు. పైగా ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. వాహనంపై పడిపోవడంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

దీనిపై యూపీ మాజీ మఖ్యమంత్రి మాయావతి స్పందిస్తూ.. విద్యార్థిని ఈవ్‌టీజింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధారకరం. ఇందుకు కారణమైనవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈవ్‌టీజింగ్ ఆరోపణలను బులంద్‌శహర్ పోలీసులు కొట్టిపారేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి అతుల్ శ్రీవాస్తవ తెలిపారు. ట్రాఫిక్ కారణంగా ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయని వెల్లడించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu