ఉత్తరాఖండ్ మాజీ సీఎంకు సీబీఐ ఉచ్చు!

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్‌ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. 2016 మార్చిలో బలపరీక్షకు ముందు కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఓ స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ‘‘సీబీఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు మేము కోర్టుకు వెల్లడించాం..’’ అని సీబీఐ తరపు న్యాయవాది సందీప్ టాండన్ పేర్కొన్నారు. కాగా […]

ఉత్తరాఖండ్ మాజీ సీఎంకు సీబీఐ ఉచ్చు!
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 1:05 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్‌ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. 2016 మార్చిలో బలపరీక్షకు ముందు కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఓ స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ‘‘సీబీఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు మేము కోర్టుకు వెల్లడించాం..’’ అని సీబీఐ తరపు న్యాయవాది సందీప్ టాండన్ పేర్కొన్నారు.

కాగా ఈ నెల 20న సీబీఐ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో రావత్‌పై చేసిన దర్యాప్తు నివేదికను సీబీఐ గతనెలలోనే ఉత్తరాఖండ్ హైకోర్టుకు సమర్పించింది. 2016లో తొమ్మిది మంది రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై హరీశ్ రావత్ ఓ జర్నలిస్టుతో మాట్లాడుతున్నట్టు వెలుగుచూసిన స్టింగ్ ఆపరేషన్‌ వీడియో సంచలనం సృష్టించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదనీ.. కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని రావత్ పేర్కొన్నారు.