జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన అభియోగాలపై ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదు
Follow us

|

Updated on: Oct 10, 2020 | 9:03 PM

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన అభియోగాలపై ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారుల అంతు చూస్తానంటూ జేసీ దివాకర్‌ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.  తాడిపత్రి సీఐ తేజోమూర్తి కంప్లైంట్ మేరకు పోలీసులు నమోదు చేశారు. ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్!)

ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం జేసీ శుక్రవారం వ్యాఖ్యానించారు.  తాడిపత్రి గనులు, భూగర్భ కార్యాలయానికి చేరుకున్న జేసీ దివాకర్ రెడ్డి  హల్‌చల్ చేశారు. నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గనులకు పర్మిషన్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన అధికారులను హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు రూల్స్ ఉండవని, బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు జేసీ. ( ఖమ్మం జిల్లా : ఆ ఊరిలో 20 రోజుల్లో 12 మరణాలు )