మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు…

ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్ లో భూమా నాగిరెడ్డి త‌న‌యుడు, మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి హల్ చల్ చేశాడు. ఓ కేసులో పోలీసుల అదుపులో నిందితుడిగా ఉన్న‌ టిడిపి మాజీ కౌన్సిలర్ నరసింహులును స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు.

మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు...
Follow us

|

Updated on: Jun 15, 2020 | 12:22 PM

ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్ లో భూమా నాగిరెడ్డి త‌న‌యుడు, మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి హల్ చల్ చేశాడు. ఓ కేసులో పోలీసుల అదుపులో నిందితుడిగా ఉన్న‌ టిడిపి మాజీ కౌన్సిలర్ నరసింహులును స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో వెంట‌నే అలర్ట‌యిన పోలీసులు హుటాహుటిన అఖిల ప్రియ ఇంటికి వెళ్లి నిందితుడిని తిరిగి పోలీస్ స్టేష‌న్ కు తీసుకువ‌చ్చారు. స్టేష‌న్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసిన అఖిల ప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీసులు సెక్షన్స్ 353, 224 , 225, 212 కింద కేసులు నమోదు చేశారు.