దక్షిణ కొరియాపై సైనిక చర్యకు రెడీ ! కిమ్ యో జాంగ్

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఇన్నాళ్లకు నేరుగా.. ప్రత్యక్షంగా పాలిటిక్స్ లోకి దిగింది. సౌత్ కొరియాతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని....

దక్షిణ కొరియాపై సైనిక చర్యకు రెడీ ! కిమ్ యో జాంగ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2020 | 11:12 AM

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఇన్నాళ్లకు నేరుగా.. ప్రత్యక్షంగా పాలిటిక్స్ లోకి దిగింది. సౌత్ కొరియాతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని, ‘శత్రువు’పై తదుపరి చర్య సైన్యం నుంచే వస్తుందని ఆమె ప్రకటించింది. ‘చెత్తను డస్ట్ బిన్ లోకి తోసేయాల్సిందే ! మా సుప్రీం అధినేత నాకు ఇఛ్చిన అధికారాల మేరకు  తదుపరి చర్య తీసుకునేందుకు నేను సైనిక వ్యవహారాల అధిపతిని ఆదేశిస్తున్నా’ అని జాంగ్ పేర్కొంది. సౌత్ కొరియా ప్రవర్తనను ఖండిస్తూ ప్రకటనలు చేసే బదులు ప్రతీకార చర్యలు చేపట్టడమే బెటరని ఆమె వ్యాఖ్యానించింది.  విడిపోయిన కొరియన్ లీడర్ల మధ్య తొలిసారి శిఖరాగ్ర సమావేశం 2000 వ సంవత్సరం జూన్ 13 న జరిగింది. నాటి నార్త్ కొరియా అధ్యక్ధుడు కిమ్ డే జంగ్, సౌత్ కొరియాతో జరిపిన సమావేశంలో.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను పెంచుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తరువాత ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. అయితే మెల్లగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా తన అణుపాటవ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చేస్తున్న యత్నాలను సౌత్ కొరియా వ్యతిరేకిస్తూ వచ్చింది. దక్షిణ కొరియా యాక్టివిస్టులు నార్త్ కొరియాకు వ్యతిరేకంగా సరిహద్దుల పొడవునా బెలూన్లలో సందేశాలు వదలడం ప్రారంభించారు . ఇలాంటి చర్యలను నార్త్ కొరియా అధినేత కిమ్ ఖండిస్తూ వచ్చాడు.