సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్…

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆయ‌న కుటుంబ స‌భ్యులు అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ సంగతి తెలిసిందే. సుశాంత్ కు చ‌నిపోయే అంత పెద్ద బాధ‌లు లేవ‌ని..ఇది ఖ‌చ్చితంగా హ‌త్యే అయి ఉంటుంద‌ని వారు ఆరోపించారు. అయితే తాజాగా బయటకొచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయ‌న‌ది ఆత్మహత్యే అని తేలింది. ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆయన సూసైడ్ చేసుకున్నార‌ని నిర్దార‌ణ అయ్యింది. ముంబై లోని జూహూ ఏరియాలో ఉన్న […]

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్...
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2020 | 1:56 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆయ‌న కుటుంబ స‌భ్యులు అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ సంగతి తెలిసిందే. సుశాంత్ కు చ‌నిపోయే అంత పెద్ద బాధ‌లు లేవ‌ని..ఇది ఖ‌చ్చితంగా హ‌త్యే అయి ఉంటుంద‌ని వారు ఆరోపించారు. అయితే తాజాగా బయటకొచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయ‌న‌ది ఆత్మహత్యే అని తేలింది. ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆయన సూసైడ్ చేసుకున్నార‌ని నిర్దార‌ణ అయ్యింది. ముంబై లోని జూహూ ఏరియాలో ఉన్న కూపర్ ఆస్ప‌త్రిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. డెడ్ బాడీకి కరోనా టెస్టులు సైతం చేసి..ఫ‌లితం నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఆదివారం రాత్రి ఈ పోస్ట్ మార్టం జ‌ర‌గ్గా.. రిపోర్ట్‌ని సోమవారం ఉదయం మీడియాకు అందించారు. ప్రజంట్ సుశాంత్ మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. ఈ రోజు సాయంత్రం సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యపై పోలీసులు లోతైన ద‌ర్యాప్తు చేస్తున్నారు. అత‌డు గ‌త 6 నెలలుగా సుశాంత్ డిప్రెషన్‌లో ఉన్నార‌ని పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కాగా సుశాంత్ మాజీ మేనేజ‌ర్ దిశా కూడా ఇటీవ‌లే ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో ఆ దిశ‌లో కూడా పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.