క్లైమాక్స్‌లో రాజధాని అంశం: ఇంకో రెండు రోజులే

ఏపీ రాజధాని అంశం ఓ కొలిక్కి వస్తోంది. ప్రభుత్వం జరుపుతున్న కసరత్తు తుది అంకానికి చేరింది. ఇంకో రెండు మీటింగ్‌లు.. ఓ కేబినెట్ భేటీ.. ఆ తర్వాత అసెంబ్లీలో నిర్ణయం… రాజధాని ఎక్కడ ? ఎలా? ఈ అంశాలపై నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు జగన్ సర్కార్ శుభం కార్డు వేయబోతోంది. నిజానికి కోర్టు జోక్యం లేకుంటే.. శనివారం హైపవర్ కమిటీ చివరిసారి భేటీ అయ్యేది.. ఆ తర్వాత కేబినెట్ ‌లో హైపవర్ కమిటీ సిఫారసుపై చర్చ.. […]

క్లైమాక్స్‌లో రాజధాని అంశం: ఇంకో రెండు రోజులే
Follow us

|

Updated on: Jan 18, 2020 | 5:09 PM

ఏపీ రాజధాని అంశం ఓ కొలిక్కి వస్తోంది. ప్రభుత్వం జరుపుతున్న కసరత్తు తుది అంకానికి చేరింది. ఇంకో రెండు మీటింగ్‌లు.. ఓ కేబినెట్ భేటీ.. ఆ తర్వాత అసెంబ్లీలో నిర్ణయం… రాజధాని ఎక్కడ ? ఎలా? ఈ అంశాలపై నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు జగన్ సర్కార్ శుభం కార్డు వేయబోతోంది. నిజానికి కోర్టు జోక్యం లేకుంటే.. శనివారం హైపవర్ కమిటీ చివరిసారి భేటీ అయ్యేది.. ఆ తర్వాత కేబినెట్ ‌లో హైపవర్ కమిటీ సిఫారసుపై చర్చ.. దానికి అనుగుణంగా నిర్ణయం వెంటనే జరిగిపోయేవి. కానీ.. హైకోర్టు ప్రజాభిప్రాయ సేకరణ గడువు పొడిగించడంతో… ఆ గడువులోగా హైపవర్ కమిటీ తన సిఫారసులకు తుది రూపు ఇచ్చే ఆస్కారం లేకుండా పోయింది.

దాంతో… శనివారం పరిణామాలేమీ చోటుచేసుకోలేదు.. ఆదివారం నాడు హైపవర్ కమిటీ భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సోమవారం (జనవరి 20) ఉదయం కల్లా హైపవర్ కమిటీ నివేదిక రాష్ట్ర కేబినెట్ ముందుకు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కేబినెట్ భేటీలో నిర్ణయం.. ఆ వెంటనే ఉదయం పది గంటలకు శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో ఏ రూపంలో రాజధాని అంశాన్ని సభ ముందుకు తీసుకువచ్చేది తేల్చేయడం.. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించడం.. ఇలా కార్యాచరణ తుది అంకానికి సంబంధించిన స్టెప్స్ అని సీఎంఓ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. న్యాయ, సాంకేతిక పరమైన అడ్డంకులు రాకుండా మల్టిపుల్ ఆప్షన్స్‌పై ఫోకస్ చేశారు. సీఎం జగన్‌తో ఆర్థిక మంత్రి బుగ్గన, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి శనివారం భేటీ అయ్యి, సమాలోచనలు జరిపారు. సిఆర్డీఏ రద్దును మనీ బిల్లుగా పెట్టాలని మొదట ప్రభుత్వం భావించినా.. ఆ తర్వాత అవసరమయ్యే ఆమోదాల నేపథ్యంలో ఆ ఆలోచనను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.