హలో..! హలో..!! ఈడీ ముందుకు కార్తీ.. ఏమన్నారంటే..?

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం బయటకి వచ్చాక ఆయనను మీడియా ప్రశ్నించింది. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. దేని కోసం వచ్చారని ప్రశ్నిస్తే.. ఈడీ వారిని దసరా సందర్భంగా పలకరించేందుకు వచ్చినట్లు నవ్వుతూ చెప్పారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక […]

హలో..! హలో..!! ఈడీ ముందుకు కార్తీ.. ఏమన్నారంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 09, 2019 | 8:51 PM

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం బయటకి వచ్చాక ఆయనను మీడియా ప్రశ్నించింది. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. దేని కోసం వచ్చారని ప్రశ్నిస్తే.. ఈడీ వారిని దసరా సందర్భంగా పలకరించేందుకు వచ్చినట్లు నవ్వుతూ చెప్పారు.

2007లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పి. చిదంబరం ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.350 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇచ్చిన ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్‌లో అవకతవకలు జరిగాయన్నది సీబీఐ ఆరోపణగా ఉంది. 2008లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్‌ ఇంటెలిజెంట్‌ యూనిట్‌ దీనిని బయటకు తీసింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి సరైన అనుమతులు లేకుండా రూ 305 కోట్ల విదేశీ పెట్టుబడులు ఈ సంస్థలోకి వచ్చినట్లు ఎఫ్‌ఐయు-ఐఎన్‌డి తెలిపింది. 2010లో ఆదాయపు పన్నుశాఖ, ఈడీ ఈ కేసులు నమాదు చేశాయి. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారనేది ఆరోపణ. 2017 మే 15న సిబిఐ ఈకేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అంతేకాదు ఐఎన్ఎక్స్ మీడియా ద్వారా కార్తీకి లబ్ధి చేకూర్చేందుకు పి.చిదంబరం ప్రయత్నించారని సీబీఐ ఆరోపిస్తోంది. సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈనెల 21 వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది.