జియో ఫోన్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్..! ఇక ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే..!

ఇప్పటి వరకు అన్ లిమిటెడ్‌గా అన్ని నెట్‌వర్క్స్‌ ఆపరేటర్లకు కాల్స్ చేసిన జియో కస్టమర్లకు ఆ సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఉచితంగా అన్ని ఆపరేటర్లకు కాల్స్ చేసుకున్న కస్టమర్లు.. ఇక నుంచి జియో కాకుండా ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్స్ చేస్తే ఛార్జ్‌లు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ […]

జియో ఫోన్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్..! ఇక ఇతర ఆపరేటర్లకు కాల్ చేస్తే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 09, 2019 | 7:24 PM

ఇప్పటి వరకు అన్ లిమిటెడ్‌గా అన్ని నెట్‌వర్క్స్‌ ఆపరేటర్లకు కాల్స్ చేసిన జియో కస్టమర్లకు ఆ సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఉచితంగా అన్ని ఆపరేటర్లకు కాల్స్ చేసుకున్న కస్టమర్లు.. ఇక నుంచి జియో కాకుండా ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్స్ చేస్తే ఛార్జ్‌లు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

అయితే ఇతర ఆపరేటర్లకు చేసిన కాల్స్‌కు చెల్లించిన రుసుముకు బదులుగా.. డేటాను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) ఛార్జీల విషయంలో ట్రాయ్‌ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే, జియో నుంచి జియో నెట్ వర్క్ మధ్య చేసుకునే కాల్స్‌కు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ప్రకటించింది. అంతేకాదు ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు, ల్యాండ్‌ లైన్స్‌ విషయంలో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. అక్టోబర్‌ 10 తర్వాత రీఛార్జి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.

అయితే ఇప్పటి వరకు కస్టమర్ల నుంచి కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదని.. కేవలం డేటాకు మాత్రమే వసూలు చేశామని తెలిపింది. అయితే ట్రాయ్ నుంచి ఒత్తిడి మేరకే ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్‌లు వసూలు చేస్తున్నామని తెలిపింది. ట్రాయ్ ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని తేల్చిచెప్పింది. ట్రాయ్ ఐయూసీ ఛార్జ్‌లను 1జనవరి, 2020 నుంచి ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం కొన్ని టాపప్‌ వోచర్లను కూడా ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని జియో పేర్కొంది. ఈ టాప్ అప్ వోచర్లు 10 నుంచి 100 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు