విశాఖలోనే రాజధాని.. మరింత క్లారిటీ ఇచ్చిన సీఎం

అమరావతిలో ఒకవైపు రైతులు, విపక్షాల ఆందోళనలు. మరోవైపు విశాఖలో అభినందనకు ఏర్పాట్లు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించేవారు హెచ్చరికలు చేస్తుంటే, జగన్‌ సర్కార్‌ మాత్రం రైతులకు భరోసా ఇస్తూ, విపక్షాలపై ఎదురుదాడి చేస్తూ, కాగల కార్యానికి ఎజెండా సెట్‌ చేస్తోంది. రేపటి కేబినెట్‌ భేటీలో మూడు రాజధానులను ఖరారు చేస్తే ధర్నాలు, బంద్‌లకు ప్రతిపక్షాలు స్కెచ్‌ గీశాయి. అటు కొందరు రాయలసీమ నేతలు రాష్ట్ర విభజన డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. దీంతో శుక్రవారం నాటి కేబినెట్‌ భేటీ అనేది […]

విశాఖలోనే రాజధాని.. మరింత క్లారిటీ ఇచ్చిన సీఎం
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 26, 2019 | 5:33 PM

అమరావతిలో ఒకవైపు రైతులు, విపక్షాల ఆందోళనలు. మరోవైపు విశాఖలో అభినందనకు ఏర్పాట్లు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించేవారు హెచ్చరికలు చేస్తుంటే, జగన్‌ సర్కార్‌ మాత్రం రైతులకు భరోసా ఇస్తూ, విపక్షాలపై ఎదురుదాడి చేస్తూ, కాగల కార్యానికి ఎజెండా సెట్‌ చేస్తోంది. రేపటి కేబినెట్‌ భేటీలో మూడు రాజధానులను ఖరారు చేస్తే ధర్నాలు, బంద్‌లకు ప్రతిపక్షాలు స్కెచ్‌ గీశాయి. అటు కొందరు రాయలసీమ నేతలు రాష్ట్ర విభజన డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. దీంతో శుక్రవారం నాటి కేబినెట్‌ భేటీ అనేది హైటెన్షన్‌ అంశమైంది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు శుక్రవారం నాటి కేబినెట్ భేటీ తెర దించుతుందా? లేక సరికొత్త ఉద్యమానికి తెరలేపుతుందా?

జీఎన్‌ రావు కమిటీ నివేదికపై శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్‌ భేటీపై టెన్షన్‌ నెలకొన్న పరిస్థితుల్లో- సీఎం క్యాంపు కార్యాలయంలో కృష్ణ, గుంటూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు భేటీ అయ్యారు. తొమ్మిదిరోజుల ఆందోళనలు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సందర్భంలో క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గరకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో టెన్షన్‌ ఏర్పడింది.

సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహిస్తే నిరసనలు వ్యక్తం కావచ్చని ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇచ్చింది. దీంతో కేబినెట్‌ భేటీకి వేదిక సచివాలయమా, సీఎం క్యాంపు ఆఫీసా అన్నదానిపై అధికారులు ముఖ్యమంత్రితో చర్చించారు. ఇదే సమయంలో- శనివారం సీఎం జగన్‌ విశాఖ టూర్‌ ఎజెండాను వైసీపీ ఎంపీ విజయసాయి ఖరారు చేశారు. 7 జీవోలతో విశాఖ అభివృద్ధికి 394 కోట్లు మంజూరయ్యాయి.

మూడు రాజధానుల ఫార్ములాకు వ్యతిరేకంగా తొమ్మిదో రోజు రాజధాని గ్రామాల్లో పోలీస్‌ నిర్బంధం నడమ ఆందోళనలు సాగితే, జేఏసీ నేతలు హోంమంత్రి సుచరితను కలసి ఈ ప్రతిపాదన వద్దంటూ వినతిపత్రం ఇచ్చారు. 40 మంది రైతులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ని కలసి అమరావతిని మార్చొద్దన్నారు. అఖిలపక్షం మళ్లీ సమావేశమైంది. అటు కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, బీజేపీ నేతలు రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. మూడు రాజధానులపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోద్దంటూ విపక్షాలకు సీఎంకి వార్నింగ్‌ ఇచ్చాయి. ‘

అటు రాయలసీమ నేతలు వైసీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలనీ, లేదంటే రాజధాని కావాలని బీజేపీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కేబినెట్‌ భేటీ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నేని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. రాజధానిపై టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు రెహ్మాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌ నిర్ణయం ఎలా ఉండబోతోంది? రైతులతో కలసి విపక్షం ఆందోళన చేస్తే, ప్రభుత్వం ఎలా రియాక్ట్‌ అవుతుంది అన్న అంశాలతో రాజకీయంగా ఈ వ్యతిరేకతను వైసీపీ ఎలా ఎదుర్కొంటుందన్నదే అసలు పాయింట్‌.