ఏపీలో మూడు రాజధానులు.. అంబటి ఏమన్నారంటే.?

అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నేతల భేటీ ముగిసింది. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన వంటి పలు అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. రైతులను దృష్టిలో పెట్టుకుని అందరికీ మేలు జరిగే విధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని పార్థసారధి అన్నారు. లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసి రాజధానిని నిర్మించే బదులు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో గ్రాఫిక్స్ అభివృద్ధి […]

ఏపీలో మూడు రాజధానులు.. అంబటి ఏమన్నారంటే.?
Follow us

|

Updated on: Dec 26, 2019 | 6:38 PM

అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నేతల భేటీ ముగిసింది. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన వంటి పలు అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. రైతులను దృష్టిలో పెట్టుకుని అందరికీ మేలు జరిగే విధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని పార్థసారధి అన్నారు. లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసి రాజధానిని నిర్మించే బదులు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో గ్రాఫిక్స్ అభివృద్ధి కాకుండా వాస్తవ అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పార్ధసారధి చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చించామని.. దాని ఆధారంగానే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం అంటే కొత్త నగరాలను నిర్మించడం కాదన్న ఆయన అన్ని ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఆలోచనని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే బడ్జెట్ సరిపోదని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన అన్నారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని నిర్మించడం కంటే..  అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రాజధానులు ఉంటే మంచిదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.