అమ్మఒడి రూ. 15,000 మీకు వస్తాయా.. ఆన్లైన్ ద్వారా తెలుసుకోండిలా.!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ రూ.15వేలు ఆర్ధిక సాయం అందనుంది. అంతేకాకుండా ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,455 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అమ్మ ఒడి పథకానికి అర్హులు. విద్యార్థులకు కనీసం 75% హాజరు ఉండాలి. ఒకవేళ […]

అమ్మఒడి రూ. 15,000 మీకు వస్తాయా.. ఆన్లైన్ ద్వారా తెలుసుకోండిలా.!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 29, 2019 | 3:08 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ రూ.15వేలు ఆర్ధిక సాయం అందనుంది. అంతేకాకుండా ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,455 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అమ్మ ఒడి పథకానికి అర్హులు. విద్యార్థులకు కనీసం 75% హాజరు ఉండాలి. ఒకవేళ పిల్లలు చదువును మధ్యలో నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు ఈ పథకానికి  అనర్హులు. ఇదిలా ఉంటే అమ్మఒడి పథకం అర్హతను ఆన్లైన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ముందుగా http://jaganannaammavodi.ap.gov.in/  అమ్మఒడి పథకం వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత హెచ్.ఎం లాగిన్, ఆఫీసర్ లాగిన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. దాని కింద అమ్మఒడి స్కీం చైల్డ్ వివరాలు తెలుసుకోండి అని ఉంటుంది. ఇక దానిపై క్లిక్ చేస్తే.. మరో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో తల్లి లేదా సంరక్షకులు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే కింద వచ్చే ఇమేజ్ మీద కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.