బడేటి బుజ్జి పాడెను మోసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో కీలక నేత ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. తెల్లవారు జామున గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించే క్రమంలోనే ప్రాణాలు విడిచారు. కాగా.. ఆయన పార్థీవ దేహానికి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బడేటి బుజ్జి అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు.. ఆయన పాడెను మోసారు. కాగా.. ఏలూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా బడేటి బుజ్జి […]
తెలుగుదేశం పార్టీలో కీలక నేత ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. తెల్లవారు జామున గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించే క్రమంలోనే ప్రాణాలు విడిచారు. కాగా.. ఆయన పార్థీవ దేహానికి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బడేటి బుజ్జి అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు.. ఆయన పాడెను మోసారు.
కాగా.. ఏలూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా బడేటి బుజ్జి పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి బరిలోకి దిగి.. ఘన విజయం సాధించారు. 2014 -19 వరకు ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో నాలుగువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.