సూర్యగ్రహణం ఎఫెక్ట్: పిల్లలను మట్టిలో పాతిపెట్టి..!

మూఢ నమ్మకం ఏదైనా చేయిస్తుంది. అలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. సూర్యగ్రహణం కారణంగా.. కొంత మంది దివ్యాంగ పిల్లలను మట్టిలో పాతి పెట్టారు తల్లిదండ్రులు. మరోమారు వారి బుర్రల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాన్ని బయపెట్టారు. గ్రహణ సమయంలో పసిపిల్లలను మెడలోతు వరకూ సజీవంగా పాతిపెట్టి.. నానా హంగామా చేశారు. దీనిని స్వయంగా కన్నతల్లులే చేయడం మరో కోణం. పిల్లలు గగ్గోలు పెట్టి.. ఏడ్చి మొత్తుకున్నా వారు అస్సలు పట్టించుకోలేదు తల్లులు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కర్ణాటక కలబుర్గీలోని […]

సూర్యగ్రహణం ఎఫెక్ట్: పిల్లలను మట్టిలో పాతిపెట్టి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 26, 2019 | 5:26 PM

మూఢ నమ్మకం ఏదైనా చేయిస్తుంది. అలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. సూర్యగ్రహణం కారణంగా.. కొంత మంది దివ్యాంగ పిల్లలను మట్టిలో పాతి పెట్టారు తల్లిదండ్రులు. మరోమారు వారి బుర్రల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాన్ని బయపెట్టారు. గ్రహణ సమయంలో పసిపిల్లలను మెడలోతు వరకూ సజీవంగా పాతిపెట్టి.. నానా హంగామా చేశారు. దీనిని స్వయంగా కన్నతల్లులే చేయడం మరో కోణం. పిల్లలు గగ్గోలు పెట్టి.. ఏడ్చి మొత్తుకున్నా వారు అస్సలు పట్టించుకోలేదు తల్లులు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కర్ణాటక కలబుర్గీలోని తాజస్థాన్‌పుర గ్రామంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. సూర్యగ్రహణంతో తల్లులు తమ దివ్యాంగ పిల్లలను మట్టిలో మెడలోతు వరకూ పాతిపెట్టారు. ఇలా చేయడం ద్వారా తమ పిల్లల వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం. గ్రహణం పూర్తయ్యే వరకూ వారిని అలాగే తవ్విన గోతిలో ఉంచారు. పలువురు వచ్చి వాదించినా వారు పట్టించుకోలేదు.

సూర్యగ్రహణం కారణంగా ఏర్పడే అతినీలలోహిత కిరణాల ద్వారా వ్యాధులు వస్తాయని.. గరికను ఆహారపదార్థాలపై ఉంచుతారు. అయితే.. ఇలా వైకల్యం నయమవుతుందని మాత్రం ఎక్కడా రుజువు కాలేదు. అయినా.. వారు ఎప్పటి నుంచో ఈ విధానాన్ని పాటిస్తున్నారని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు.