రూ.15కే చికెన్ బిర్యానీ.. ఎక్కడో తెలుసా.?
టైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. కానీ అది నిజమండీ బాబు.. రూ.15కే చికెన్ బిర్యానీ దొరుకుతోంది. దాని కోసం జనాలు హోటల్ దగ్గర క్యూ కట్టారు. అయితే అది మన రాష్ట్రంలో కాదు తమిళనాడులో.. అసలు ఈ 15 రూపాయల బిర్యానీ వెనుక రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగా హోటల్ ప్రారంభించాడు. జనాలను ఆకర్షించడానికి ప్రారంభోత్సవ ఆఫర్ కింద 15 రూపాయలకు చికెన్ బిర్యాని.. రూ.10కి ఎగ్ బిర్యానీ […]
టైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. కానీ అది నిజమండీ బాబు.. రూ.15కే చికెన్ బిర్యానీ దొరుకుతోంది. దాని కోసం జనాలు హోటల్ దగ్గర క్యూ కట్టారు. అయితే అది మన రాష్ట్రంలో కాదు తమిళనాడులో.. అసలు ఈ 15 రూపాయల బిర్యానీ వెనుక రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగా హోటల్ ప్రారంభించాడు. జనాలను ఆకర్షించడానికి ప్రారంభోత్సవ ఆఫర్ కింద 15 రూపాయలకు చికెన్ బిర్యాని.. రూ.10కి ఎగ్ బిర్యానీ ఇస్తున్నట్లు ప్రచారం చేశాడు. ఇంకేముంది బిర్యానీ కోసం ప్రజలు ఎగబడ్డారు. ఇక వచ్చిన అందరికీ హోటల్ సిబ్బంది వడ్డించలేక చచ్చారనుకోండి.
అసలే వందల్లో ఉండే చికెన్ బిర్యానీ 15 రూపాయలకే వస్తోందంటే భోజన ప్రియులు ఈ అవకాశాన్ని వదులుకుంటారా.. హోటల్ ముందు బారులు తీరారు. ఇక ఈ ఆఫర్ వల్ల సదరు వ్యక్తి హోటల్ బాగా ఫేమస్ అయింది కూడా.