మానవత్వం: లాక్ డౌన్ వేళ ఆపన్నహస్తం.. వరంగల్ లో ప్రయివేటు ఉపాధ్యాయులకు వ్యాపారస్తులు, సీ మోర్ నిర్వాహకుల చేయుత
కరోనా లాక్ డౌన్ గురువులకు గండంలా మారింది. ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. కొన్ని విద్యాసంస్థలు వారికి ఆఫ్ సాలరీ చెల్లించి అండగా..

కరోనా లాక్ డౌన్ గురువులకు గండంలా మారింది. ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. కొన్ని విద్యాసంస్థలు వారికి ఆఫ్ సాలరీ చెల్లించి అండగా నిలుస్తుంటే మరికొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు బజారున పడేశాయి. దీంతో వేలాది మంది ప్రయివేటు ఉపాధ్యాయులు, లెక్చలర్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది దాతలు వారికి పరిచయం ఉన్న పంతుళ్ళు, వారికి- వారి పిల్లలకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు.. దిక్కు తోచని స్థితిలో చిక్కుకోవడాన్ని చూసి ఆపన్న హస్తం అందిస్తున్నారు.
అందులో భాగంగా వరంగల్ జిల్లా హన్మకొండ లోని ఎంఎస్ రెడ్డి కాంప్లెక్స్ లో 175 మంది ప్రయివేటు ఉపాధ్యాయులకు 45 రోజులకు సరిపడ నిత్యావసర సరుకుల, బియ్యం అందించారు. వరంగల్ కు చెందిన కొంతమంది వ్యాపారులు, సీ మోర్ అనే ఓ ఆప్టికల్ నిర్వాహకులు టీచర్లకు చేయుతనందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దాతలను అభినందించారు. ప్రతి ఒక్కరూ స్పందించి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
