బీహార్ లో కొత్త కూటమి.. బీఎస్పీతో ఆర్‌ఎల్‌ఎస్‌పీ పొత్తు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల పోరులో తలబడేందుకు కొత్త పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల పోరులో తలబడేందుకు కొత్త పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటములు బీహార్ రాజకీయాల్లో నువ్వా నేనా అన్నట్లు ఢీకొంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పార్టీలతో పాటు చిన్నా చితక పార్టీలు కూడా జత కట్టి పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో మరో జాతీయ పార్టీ స్థానిక పార్టీతో జతకడుతున్నట్లు తెలిపింది. అంతేకాదు తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించేసింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)తో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. బీహార్ ప్రజల ఆశీర్వాదంతో తమ కూటమి గెలిస్తే ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధినేత ఉపేంద్ర కుశ్వానాను ముఖ్యమంత్రిని చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో పొత్తు ఖరారైంది. ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వానాతో అన్ని చర్చలు పూర్తయ్యాయి. మా కూటమి అభ్యర్థిగా ఉపేంద్ర కుశ్వానాను ప్రతిపాదిస్తున్నట్లు మాయవతి వెల్లడించింది మాయావతి.