Bird Flu: ఆ రాష్ట్రంలో ఓ వైపు కరోనా.. మరోవైపు జికా వైరస్, తాజాగా బర్డ్ ఫ్లూ కలకలం..

కోవిడ్ కేసులు కొంతమేర తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కరోనాలోని వేరియంట్లు, జీకా వైరస్ అలజడి సృష్టిస్తున్నాయి. కేరళలో కరోనా, జీకావైరస్ కేసులు

Bird Flu: ఆ రాష్ట్రంలో ఓ వైపు కరోనా.. మరోవైపు జికా వైరస్, తాజాగా బర్డ్ ఫ్లూ కలకలం..
Bird Flu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 27, 2021 | 5:13 PM

Bird Flu Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గతంతో పోలిస్తే కోవిడ్ కేసులు కొంతమేర తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కరోనాలోని వేరియంట్లు, జీకా వైరస్ అలజడి సృష్టిస్తున్నాయి. కేరళలో కరోనా, జీకావైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతీరోజూ దేశంలో ఎక్కువగా కేరళలోనే 10వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జీకా వైరస్ కేసులు కూడా 50కి పైగా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కేరళలో బర్డ్ ఫ్లూ కూడా కలకలం రేపుతోంది. కలమసేరిలో అధిక సంఖ్యలో బాతులు చనిపోయాయి. దీంతోపాటు కోజికోడ్‌లోని కూరచుండ్‌ పరిధిలోని పౌల్ట్రీల్లో అధిక సంఖ్యలో బ్రాయిలర్ కోళ్లు చనిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చనిపోయిన బాతులు, కోళ్లకు సంబంధించిన నమూనాలను సేకరించి రాష్ట్రంలోని ల్యాబ్‌లకు పంపించారు.

కాగా.. పరీక్షల్లో బర్డ్ ఫ్లూ లేదని తేలింది. బాతులు, కోళ్లు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదని.. బ్యాక్టీరియా సంక్రమణ వల్లనే చనిపోయినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. డయాగ్నొస్టిక్ లాబొరేటరీకి నమూనాలను పంపించి క్షుణ్ణంగా పరీక్షలు జరిపినట్లు డిపార్ట్‌మెంట్ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. బ్యాక్టీరియా వల్లనే మరణించినట్లు అధికారులు స్పష్టంచేశారు. ముందుగా బర్డ్ ఫ్లూ సోకినట్లు వార్తలు వెలువడటంతో.. ఆ నమూనాలను భోపాల్‌కు పంపించి పరీక్షలు నిర్వహించారు. ఆ నమూనాల్లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉన్నట్లు తేలింది. కాగా.. కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో.. మిగతా కోళ్లకు యాంటీ బ్యాక్టిరియల్ ఇంజెక్షన్లను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:

Maharashtra Floods: మహారాష్ట్ర వరదల్లో 251 మందికి పైగా మృతి.. 100 మంది గల్లంతు.. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్

Raj Kundra Case: అమ్మ దొంగా.. అరెస్టును ముందే పసిగట్టిన రాజ్ కుంద్రా..పాత ఫోన్‌ను ఏం చేశారంటే?