కరీంనగర్‌లో కలకలం రేపుతోన్న ‘స్ట్రెయిన్ కరోనా’… బ్రిటన్ నుంచి వచ్చిన వారి కోసం గాలిస్తోన్న అధికారులు.
బ్రిటన్ కేంద్రంగా వెలుగు చూసిన స్ట్రెయిన్ వైరస్ తాజాగా కరీంనగర్‌లో కలకలం రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి జిల్లాకు 16 మంది వచ్చారని సమాచారం...
britain corona in karimnagar: బ్రిటన్ కేంద్రంగా వెలుగు చూసిన స్ట్రెయిన్ వైరస్ తాజాగా కరీంనగర్‌లో కలకలం రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి జిల్లాకు 16 మంది వచ్చారని సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే పది మంది శాంపిల్స్ తీసుకున్న జిల్లా వైద్యాధికారులు నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే మరో ఆరుగురి కోసం అధికారులు వేట ప్రారంభించారు.