పెళ్లికొడుకు మృతి కేసులో మరో ట్విస్ట్..!
ఇల్లంతా పెళ్లిసందడి.. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. అంతలోనే పెను విషాదం అలముకుంది. కొద్దిగంటల్లో పెళ్లి జరగుతుందనగా.. పెళ్లికొడుకు శవమై కనిపించాడు. అదికూడా కళ్యాణ మండపంలోనే. కొంపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందని ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో సందీప్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. అసలేం జరిగిందని..? ఇటు పెళ్లికి వచ్చిన వారితో పాటు.. అటు పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ కేసులో తాజాగా.. మరో ట్విస్ట్ […]
ఇల్లంతా పెళ్లిసందడి.. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. అంతలోనే పెను విషాదం అలముకుంది. కొద్దిగంటల్లో పెళ్లి జరగుతుందనగా.. పెళ్లికొడుకు శవమై కనిపించాడు. అదికూడా కళ్యాణ మండపంలోనే. కొంపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందని ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో సందీప్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. అసలేం జరిగిందని..? ఇటు పెళ్లికి వచ్చిన వారితో పాటు.. అటు పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఈ కేసులో తాజాగా.. మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్ తండ్రి నక్కెర్తి శ్రీనివాసాచారి అన్నారు. పెళ్లికి ముందు ఫొటో షూట్ కోసం.. వెళ్లి.. ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని సందేహం వ్యక్తం చేశారు. సందీప్ చెప్పినట్టే.. తన పెళ్లి, రిసెప్షన్ చేస్తున్నానని.. సందీప్‌ది ఆత్మహత్య కాదని.. హత్యనే అని గట్టిగా చెప్పారు. సందీప్‌ని బాబాయ్, పిన్నమ్మలే హత్య చేసి ఉంటారేమోనని.. శ్రీనివాసాచారి అనుమానిస్తున్నారు. గతంలో.. మృతుడి తండ్రికి, తమ్ముడికి గొడవలు జరినట్టు సమాచారం. దీంతో.. వారే హత్య చేసి ఉంటారని.. మృతుడి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.