Bride Runs Away: ముహూర్తం టైమ్‌కు వధువు జంప్‌.. చెల్లిని పెళ్లాడిన వరుడు.! అంతలోనే ట్విస్ట్.?

Bride Runs Away: మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వధువు తన లవర్‌తో కలిసి జంప్‌ అయ్యింది. దీంతో మొదట షాక్‌ గురైన వరుడు..

Bride Runs Away: ముహూర్తం టైమ్‌కు వధువు జంప్‌.. చెల్లిని పెళ్లాడిన వరుడు.! అంతలోనే ట్విస్ట్.?
marriage
Follow us

|

Updated on: Feb 22, 2021 | 6:16 AM

Bride Runs Away: మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వధువు తన లవర్‌తో కలిసి జంప్‌ అయ్యింది. దీంతో మొదట షాక్‌ గురైన వరుడు.. ముహూర్తం టైమ్‌కు ఎలా అయిన తన పెళ్లి జరగాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్నాడు. వధువు చెల్లెలిని ఇచ్చి అయినా తనకు కట్టబెట్టాలని వరుడు కోరాడు. దీంతో వేరే గత్యంతరం లేక అమ్మాయి కుటుంబసభ్యులు కూడా ఇందుకు ఒప్పుకున్నారు. అనుకున్న సమయానికి పెళ్లికొడుకు..వధువు చెల్లిలో మెడలో తాళి కట్టాడు. అయితే ఇక్కడే వరుడికి అసలైన ట్విస్ట్‌ ఎదురైంది. అధికారులు ఈ పెళ్లి చెల్లదని తేల్చి చెప్పడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. మరికొద్ది సేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా..వధువు తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. దీంతో తమ పరువు పోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని వరుడు తరుపున వాళ్లు డిమాండ్‌ చేశారు. దీంతో వేరే దారి లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది.

పెళ్లి తంతు తర్వాత అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లారు..సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని,చట్టారీత్యా ఇది నేరమని తెలిపారు. 18 ఏళ్లు వచ్చేదాకా అమ్మాయిని అత్తారింటికి పంపొద్దని అధికారులు చెప్పారు. మైనర్‌ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Latest Articles
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు